తలలు తెగిపడినా యూటీకి ఒప్పుకోం : హరీష్‌రావు

మెదక్ :  తలలు తెగిపడినా యూటీకి ఒప్పుకోం. హైదరాబాద్‌ను యూటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని హరీష్ రావు అన్నరు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తాం అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తాట తీస్తారని హెచ్చరించారు.. మిలియన్ మార్చ్ అనుమతి కోసం తాము కోర్టుకు వెళితే.. సమైక్యాంధ్ర సభకు ప్రభుత్వమే అనుమతివ్వడం ఇది దారుణమన్నరు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ హరీష్‌రావు ముగించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.