తమిళనాడులో ‘విశ్వరూపం’కు తొలగిన అడ్డంకులు

చెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ నిర్మించిన ‘విశ్వరూపం’ సినిమా విడుదలకుకు తమిళనాడులో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ముస్లిం సంఘాల నేతలతో కమల్‌హాసన్ జరిపిన చర్చల సఫలమయ్యాయి. కమల్‌హాసన్, ముస్లింలకు మధ్య ఏర్పడిన వివాదం ముగిసింది. ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. సినిమాలోని ఏడు వివాదాస్పద సన్నివేశాలను తొలగించడానికి కమల్‌హాసన్ అంగీకరించారు. దీంతో రేపు తమిళనాడులో ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ముస్లిం పెద్దలు కూడా సినిమాపై వేసిన దావాను ఉపసంహరించుకుంటున్నామని, సినిమా విడుదలకు తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన కేసును కూడా ఉపసంహరించుకుంటున్నామని నిర్మాత కమల్‌హాసన్ పేర్కొన్నారు. వివాదం ముగిసేందుకు సహకరించిన రాష్ట్ర హోంశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.