ఢిల్లీ దద్దరిల్లేలా ఉద్యమం-జేఏసీ

 

TNGOఢిల్లీ దద్దరిల్లేలా ఉద్యమిస్తామని టీ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. డిసెంబర్ 1న తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని.. ఆ రోజునే తమ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డు పడుతున్న ఢిల్లీ పెద్దలను నిలదీసేలా రాజకీయ కార్యాచరణ ఉంటుందని సూత్రవూపాయంగా తెలియచేశారు. మంగళవారం టీఎన్జీవో కార్యాలయంలో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం జేఏసీ చైర్మన్ కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీలోని భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశంలో పాల్గొంటాయని, విస్తృతంగా చర్చ జరిపి.. రాజకీయ కార్యాచరణకు రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు అస్పష్ట ప్రకటనలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని.. వీరి కపట నాటకాన్ని ప్రజాక్షేవూతంలో ఎండగడుతామని హెచ్చరించారు. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడి.. ఢిల్లీకి సెగ తగిలినప్పడల్లా, ఢిల్లీ పెద్దలు మోసపూరితమాటలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. వాయలార్ రవి ప్రకటన అందులోభాగమేనని అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు తెలంగాణపైన విస్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొందాల్సిన బాధ్యత కూడా వారికే ఉన్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న టీజేఏసీ.. మరోసారి వారి ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఉద్యయ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2009, నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరశన దీక్షను పురస్కరించుకుని ఈనెల 29న తెలంగాణవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించనున్నామని కోదండరాం పేర్కొన్నారు. ఇందులో టీ జేఏసీ సంఘాలన్నీ పెద్దఎత్తున పాల్గొంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సైతం విస్పష్ట కార్యక్షికమాన్ని ప్రకటించనున్నదని తెలిపారు.

ఘనంగా ధూంధాం ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ఎనలేనిదని కోదండరాం అన్నారు. ప్రజలను ఉద్యమాలకు సన్నద్ధం చేయడంలో ధూంధాంలు విప్లవ భూమిక పోషిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ధూం ధాం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22న దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రెటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ సీ విఠల్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌డ్డి, తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షులు ఎల్లయ్య, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అధ్యాపకుల జేఏసీ నాయకులు కత్తి వెంకటస్వామి, న్యూడెమొక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కే గోవర్ధన్, జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఇంజినీరింగ్ జేఏసీ అధ్యక్షుడు వెంక హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు హరిబాబు, తెలంగాణ టీచర్స్ జేఏసీ నాయకులు మణిపాల్‌డ్డి, రసమయి బాలకిషన్, అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌డ్డి తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.