ఢిల్లీ దద్దరిల్లాలె.. సంసద్ యాత్రకు జేఏసీ భారీ సన్నాహాలు

 

delhi– 29, 30 తేదీల్లో జంతర్‌మంతర్ వద్ద ధర్నా
– ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలి
– ఇది కాంగ్రెస్‌కు ఇస్తున్న చివరి అవకాశం
– ఉద్యమం ఆపేది లేదు.. : కోదండరాం
– బయ్యారంపై ముఖ్యమంవూతిది వితండవాదం
తెలంగాణ డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లేలా టీ జేఏసీ సం సద్ యాత్రను నిర్వహించనుంది. ఈ నెల 29, 30 తేదీ ల్లో జంతర్‌మంతర్ వేదిక ధర్నాతో, తెలంగాణ నినాదాలతో మార్మోగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ధర్నా తెలంగాణ దృఢ సంకల్పాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పనుంది. కార్యక్షికమానికి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు, మేధావులతోపాటు పలు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల జాతీయ నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ డిమాండ్‌కు కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ ప్రభుత్వం అంగీకరించేలా ప్రజాస్వామికంగా తమ వం తు ప్రయత్నాలు చేస్తున్నామని, వాస్తవాలను గుర్తెరగకపోతే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని జేఏసీ నేత లు హెచ్చరించారు.

స్టీరింగ్ కమిటీ సమావేశంలో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య, బీజేపీ నేత రాజేశ్వరరావు, న్యూ డెమొక్షికసీ నేత కే గోవర్ధన్, మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ చైర్మన్ హమీద్ మహ్మద్‌ఖాన్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రావణ్‌కుమార్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ సీ విఠల్, కో చైర్మన్ కారం రవీందర్‌డ్డి, టీఎల్‌ఎఫ్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు భైరి రమేశ్, తెలంగాణ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నాగరాజు, టీ విద్యుత్ సంఘాల జేఏసీ చైర్మన్ రఘు, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంలో తేడా లేదని, తప్పేం కాదని జేఏసీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం బయ్యారం వద్దనే జాతీయస్థాయి స్టీల్ పరిక్షిశమను నెలకొల్పి, దానిని కూడా జాతికి అంకితం చేయొచ్చునని తీర్మానించింది.

నవీనాచారి, అశోక్ మరణాలకు శ్రద్ధాంజలి ఘటించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజలు ఇస్తున్న చివరి అవకాశంగా భావించాలని యూపీఏ ప్రభుత్వానికి సూచించింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్పీపీలు తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉన్నాయని విమర్శించింది. విలేకరుల సమావేశంలో తొలుత టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంసద్ యాత్ర వివరాలను తెలిపారు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా చలో పార్లమెంటు కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ సంసద్ యాత్ర రైలు బయలుదేరుతుందని, 29 సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటుందని చెప్పారు. 29న ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు, తిరిగి 30 మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌లతోపాటు రఘువంశవూపసాద్, ముకుల్‌రాయ్, అజిత్‌సింగ్, దేవవూబతవిశ్వాస్, చంద్రకాంత్‌గార్గ్, బిస్మాముత్యాయర్ వంటి జాతీయ పార్టీల నాయకులందరితో సమావేశమయ్యామని, వారందరూ ధర్నాకు హాజరవుతామని హామీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ పేర్కొన్నారు.

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేయవద్దని చాటిచెప్పిన ఉద్యమ చైతన్యం ఉన్న నవీనాచారి, అశోక్ వంటి కార్యకర్తలు కూడా బలిదానాలకు పాల్పడటం బాధాకరమేనని అన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్త నవీనాచారి, బీజేవైఎం కార్యకర్త అశోక్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖల్లో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను తప్పుబట్టారని, దీనితో కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతున్నదని కోదండరాం తెలిపారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష నాటి నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా, అఖిలపక్ష సమావేశం నిర్వహించాక కూడా కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఆగిపోయేది కాదని, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్షికమం నిర్వహిస్తామని చెప్పారు. బయ్యారంపై ముఖ్యమంవూతిది వితండవాదమని కోదండరాం విమర్శించారు. బయ్యారంలో ప్లాంటు పెట్టినా అది జాతీయవాదమే అవుతుందని, దానికి జాతికి అంకితం చేయొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తెలంగాణ నినాదాలను దద్దరిల్లజేయాలని విజ్ఞప్తి చేశారు. దేశం అబ్బురపడేలా జంతర్‌మంతర్‌లో తెలంగాణవాదుల ధర్నాలు జరుగాలని కోరారు.

చాయ్‌పానీ ఉద్యమాలు.. డూప్ యుద్ధాలు..
బీజేపీ నేత రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులకు ఆఖరి అవకాశం ఇస్తున్నామని, ప్రస్తుత పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే సంపూర్ణ మద్దతును ఇస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు జయవూపదమవుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. కాంగ్రెస్ ఇలాంటి సందర్భంలోనైనా బిల్లు పెట్టేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఉద్యమాలకు పిలుపునివ్వగానే టీడీపీ ప్లకార్డుల ఉద్యమాలను చేపడుతూ ఉంటుందని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చాయ్‌పానీ ఉద్యమాలు చేస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు డూప్ యుద్ధాలకు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, చాయ్‌పానీ ఉద్యమాలకు, ప్లకార్డుల కుహనా ఉద్యమాలకు స్వస్తి పలకాలని లేకుంటే తెలంగాణ ప్రజలు తగిన విధంగా బదులు చెప్తారని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఉద్యమ పార్టీలలో తలదాచుకునేందుకు, తిరిగి ఎన్నిక కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారు ఏం త్యాగాలు చేశారో ప్రజలకు ముందుగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

హాజరుకానున్న కేసీఆర్, టీఆర్‌ఎస్ శ్రేణులు
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రావణ్‌కుమార్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ దున్నపోతు వైఖరిని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. నవీనాచారి, అశోక్ మరణాలు ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. జేఏసీ పిలుపులో ప్రతీ సందర్భంలో టీఆర్‌ఎస్ అగ్రభాగంలో ఉంటున్నదని, ఈసారి కూడా ముందువరుసలో ఉంటామని చెప్పారు. ధర్నాలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటారని, టీఆర్‌ఎస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఉద్యమంలో నిలిచి తెలంగాణ ప్రజల మన్ననలను అందుకుంటారని చెప్పారు. న్యూ డెమొక్షికసీ నేత కే గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కో ఖతంకరో, తెలంగాణా హాసిల్ కరో నినాదానికి ఢిల్లీ ధర్నా మరోసారి వేదిక అవుతున్నదని చెప్పారు. అణచివేత, పీడన, అశాంతిపైన అవిక్షిశాంతంగా పోరాడుతున్న తెలంగాణ పార్లమెంటు ముందు తెలంగాణ బావుటాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యిందని పేర్కొన్నారు. వేయిమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో తెలంగాణకోసం పోరాటం చేయాలని, తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ చైర్మన్ హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంఘటిత చైతన్యవేదికగా జంతర్‌మంతర్ ప్రతిధ్వనించనున్నదని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.