డెస్క్ జర్నలిస్టులను సర్కారు గుర్తించాలి- అల్లం నారాయణ

allamపత్రికల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(టీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్‌తోపాటు ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు వంటి సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. డెస్క్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి త్వరలో హైదరాబాద్‌లో డెస్క్ జర్నలిస్టుల మహాగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ ఇన్‌చార్జి మార్కండేయ మాట్లాడుతూ డెస్క్‌జర్నలిస్టుల జీవితాలు అద్దాల మేడలాంటివన్నారు. పాత యూనియన్లు డెస్క్ జర్నలిస్టుల సమస్యలను గుర్తించకపోగా, నిర్లక్ష్యం చేశాయన్నారు డెస్క్ జర్నలిస్టుల  సమావేశంలో టీజేఎఫ్ ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, కోశాధికారి రమణ, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.