డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ ఇవ్వాలి

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీకి పోరుతెలంగాణ విన్నపం..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫీల్డ్‌ జర్నలిస్టుల ప్రియారిటీ తగ్గి డెస్క్‌ జర్నలిజం ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం నడుస్తున్నదంతా డెస్క్‌ ఓరియెంటెడ్‌ జర్నలిజమే. వార్త ప్రచురుణలో అయినా.. ప్రసారంలో అయినా డెస్క్‌దే ముఖ్యపాత్ర.  అలాంటి డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్‌ విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది.  జర్నలిజం అంటే రిపోర్టింగే అన్న భావనలో డెస్క్‌ జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నరు. జర్నలిస్టు సంఘాల్లో ఎక్కువమంది బ్యూరో వాళ్లే నేతలుగా చెలామణి అవడం వల్ల డెస్క్‌ జర్నలిస్టుల సమస్యలు ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో నైనా డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్లు వస్తాయని ఆశిస్తున్నం. డెస్క్‌ జర్నలిస్టులకు ఈ కమిటీ అయినా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నం.  రిపోర్టర్లతో సమానంగా డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడేషన్లతో పాటు ప్రభుత్వం ఇస్తున్న  అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.