డీకే అరుణ వర్సెస్ నాగం

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా బుధవారం మంత్రి డీకే అరుణ, నాగం జనార్దన్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఏర్పాటయ్యేవరకు కాంగ్రెస్‌పై నమ్మకం లేదంటూ నాగం పేర్కొనగా.. ఆయన వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఒక్క ఓటు రెండు రాష్ర్టాలన్న బీజేపీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే కాంగ్రెస్ తెలంగాణ బిల్లును తీసుకువచ్చిందని, కాంగ్రెస్‌తోనే తెలంగాణ వస్తుందని ఆమె స్పష్టంచేశారు.
nagamనాగం బదులిస్తూ.. కాంగ్రెస్‌పార్టీ 1,200 మందిని బలితీసుకుంది. తెలంగాణ అన్నందుకు సహచర నేత జూపల్లి కష్ణారావుపై డీకే అరుణ విరుచుకుపడి.. ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించారు. ఈ రోజు జిల్లాలో (మహబూబ్‌నగర్) నీ సంగతి తెలియనివారు ఎవ్వరూ లేరు అని మంత్రిపై మండిపడ్డారు. దాంతో డీకే అరుణ మాట్లాడుతూ ఉస్మానియాలో దెబ్బలు తిన్నాక నాగం జనార్దన్‌రెడ్డికి తెలంగాణ గుర్తుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత ఆయనకు లేదు. ఎవరి అవసరాలకు వారు పార్టీ మారారు. ఆర్డీఎస్ గురించి మాట్లాడే అర్హత నాగం జనార్దన్‌రెడ్డికి లేదు అని విరుచుకుపడ్డారు. నాగం కూడా తీవ్రంగా స్పందిస్తూ నేను మీ(డీకే) విషయాల గురించి మాట్లాడితే ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఉండలేరు. నాకు ఇవాళ తెలంగాణ గుర్తుకు వచ్చిందనడం సరికాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏడున్నర నెలలు జైలులో ఉన్నాను. నా పెండ్లి పత్రికల్లో జై తెలంగాణ అని రాయించాను. నన్ను రెచ్చగొట్టవద్దు అంటూ హితవు పలికారు.

సీమాంధ్ర ఎమ్మెల్యేలపై హరీశ్‌రావు ఫైర్
సభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నిష్పక్షపాతి అని వ్యాఖ్యానించిన సీమాంధ్ర నేతలపై హరీశ్ మండిపడ్డారు. వారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఆరు జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజీ కట్టనివారు, రాయలసీమ 4 జిల్లాల్లో ఇప్పటికే నాలు గు కాలేజీలుండగా, మరో కాలేజీకే అక్కడే అనుమతివ్వడం నిష్పక్షపాతమా? అని ప్రశ్నించారు. రాయలసీమలో ఒక సైనిక్ స్కూల్ ఇప్పటికే ఉండగా, మరో స్కూలును చిత్తూరుకు తరలించ డం.. తెలంగాణ రైతాంగం నాలుగేళ్లుగా వడగండ్ల వానతో నష్టపోతే రూపాయి విదల్చని సీఎంది నిష్పక్షపాతమా? అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం నిష్పాక్షికతకు నిదర్శనమా? చెప్పాలని నిలదీశారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.