టీడీపీ అధినేతకు డిప్యూటీ సీఎం పదవి-కేటీఆర్

కాంగ్రెస్, టీడీపీలు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు, కిరణ్‌ల మాటలు చూస్తే ఒకేళా ఉన్నాయని అన్నారు. వాళ్ల మాటలు చూస్తుంటే రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ అవిశ్వాసం వీగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందని టీడీపీ భావిస్తోందని, ఆపార్టీతో కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దక్కే అవకాశం ఉందని ఎద్దేవ చేసిన్రు. కాంగ్రెస్, టీడీపీలు ఒకే తాను ముక్కలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి పాలన కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి వీళ్లేదంటూనే కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మద్ధతు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోన్న ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని టీడీపీ ఎందుకు బలపరచడంలేదో చెప్పాలని సవాలు విసిరారు. అవిశ్వాసంపై టీడీపీ వైఖరితో ప్రజలకు ఎవరు చేసే మోసం ఏంటో అర్థమైందని వివరించారు.
ప్రతిపక్ష పార్టీగా టీడీపీ విఫలమైంది: హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాడటంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్‌పై వీధుల్లో తొడలు సరుస్తున్న టీడీపీ అసెంబ్లీలో అవిశ్వాసం పెడతామంటే దూరంగా పారిపోతోందని దుయ్యబట్టారు. తమతో కలిసి రావడానికి టీడీపీకి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన సరియైన సమయం ఇదేనని ఆయన అన్నారు. అసలు ప్రజా సమస్యలపై ప్రవేశ పెట్టిన తీర్మానానికి టీడీపీ ఎందుకు మద్ధతు ఇవ్వదని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా అవకాశం ఉన్నందున టీడీపీ తమ అవిశ్వాసానికి మద్ధతు తెలిపి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సహకరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వడం విడ్డూరమని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబు నిర్ణయం వల్ల ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.