టీ బిల్లు ప్రతుల చించివేసినందుకు కేసు నమోదు

హైదరాబాద్: గత అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముసాయిదా బిల్లును చించి వేసినందుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై కేసు నమోదైంది. రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చించకుండా చించివేయడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది మహేందర్ కరీంనగర్ జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని 2 టౌన్ పోలీసులను ఆదేశించారు. ఈ చర్య తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచారని, రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టారని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎనిమిది మంది వైసీపీ, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేయాలని కోరారు. దేవినేని ఉమ, సతీష్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, ధూళిపాళ్ల, శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణబాబులు నిందితుల్లో ఉన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.