టీ-బిల్లులో 10 సవరణలు సూచించాం: హరీష్

హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై సవరణలను స్పీకర్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందజేశారు. రాష్ట్రపతి పంపిన బిల్లు-2013కు టీఆర్‌ఎస్ తరపున కొన్ని సవరణలు, సూచనలు స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశామని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు తెలిపారు. ఈ బిల్లును టీఆర్‌ఎస్ స్వాగతిస్తుందని చెప్పారు.
తెలంగాణ బిల్లులో 10 సవరణలు, సూచనలు ప్రతిపాదించామని ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
1) ఉమ్మడి రాజధాని కాల పరిమితి మూడేళ్లకు కుదించాలి.
2)హైదరాబాద్‌పై తెలంగాణ సీఎం అధికారం ఉండాలి.
3) తెలంగాణ ఏర్పడగానే మూడు నెలల్లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలి.
4)స్థానికత ఆధారంగా ఉద్యోగులను, పెన్షనర్లను గుర్తించాలి, సీమాంధ్ర పెన్షనర్ల భారం తెలంగాణ రాష్ట్రం మోయలేదని తెలిపారు.
5) ఉమ్మడి రాజధాని కాల పరిమితి మూడేళ్లకు కుదించాలి.
6) తెలంగాణలో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకే ఇవ్వాలి.
7)తెలంగాణకు వెటర్నరీ యూనివర్శిటీ, ఏఐఐఎంసీ, ఐఐఎం, ఎన్టీపీసీ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి.
8)ఆస్తుల ప్రాతిపదికన ప్రభుత్వరంగ సంస్థలను విభజించాలి.
9) హెచ్‌వోడీలు, జోనల్ గెజిటెడ్ ఆఫీసర్లు ఏ ప్రాంతంలో ఎక్కువ పని చేస్తే ఆ ప్రాంతానికే పరిమితం చేయాలి.
10) ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.