టీ బిల్లుపై ప్రధాని హామీ ఇచ్చారు : కేసీఆర్

న్యూఢిల్లీ : తాను చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి స్ఫష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని విధాలా ఏర్పాట్లు చేసిందని, తప్పకుండా తెలంగాణ ప్రజల కల సాకారమవుతుందని ప్రధాని తమతో చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. బిల్లులో కొన్ని సవరణలను కూడా లిఖిత పూర్వకంగా ప్రధానికి అందజేశామని, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.