టీ ప్రక్రియ వేగవంతం కోసం22న ముస్లిం మేధావుల చలో ఢిల్లీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రంపై, కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి పెంచేందుకు నగరం నుంచి సుమారు 40 మంది ముస్లిం మేధావులు, రాజకీయ నేతల బృందం ఈ నెల 22న చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నారు. విభజనతో ముస్లింలకు చేకూరే ప్రయోజనాలు, భవిష్యత్తు తరాల మేలు కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు గ్రేటర్ జేఏసీ మైనారిటీ విభాగం కన్వీనర్ మహ్మద్‌ఖాజా బద్రుద్దీన్ వెల్లడించారు. ఈనెల 22 నుంచి 24వరకు ఢిల్లీలో ఉంటామని, కేంద్ర మంత్రులు ఆజాద్, మొయిలీ, కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్ తదితరులను కలుస్తామని తెలిపారు. ఈ నెల 25న అజ్మీర్ దర్గాను సందర్శిస్తామని, తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోవాలని తెలంగాణ చాదర్‌ను సమర్పిస్తామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.