టీ ఉద్యోగులను వేధిస్తే ఊరుకోం

 

rta– నెల రోజుల్లోగా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారించాలి
– లేదంటే సమ్మె తప్పదు
– ప్రభుత్వానికి టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సచివాలయంలో టీ ఉద్యోగులపై కొందరు కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. పదోన్నతుల్లో, పోస్టింగ్‌లలో అన్యాయం జరుగుతున్నదని, వివక్షను ఎదుర్కొని తగిన బుద్ధిచెప్పేందుకు తెలంగాణ ఉద్యోగులమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

విధి నిర్వహణలో ఆర్టీఏ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఆర్టీఏ కమిషనర్ అనంతరామును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్టీఏ సాంకేతిక ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సకలజనుల సమ్మె నాటి హామీలను నేరవేర్చడంతో పాటు ఆర్టీఏలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల వరకు గడువు ఇస్తామని, సమస్యలు పరిష్కారం కాకుంటే భోజన విరామ సమయంలో నిరసన దీక్షలు, ఆందోళనలు చేసి ఆ తర్వాత సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వ ఖజానాలోకి అత్యధింగా 70-80శాతం మేర ఆదాయం తెలంగాణ జిల్లాల నుంచే వస్తున్నదని, ఖజానా నింపడంలో కీలకపాత్ర పొషిస్తున్న రవాణాశాఖ ఉద్యోగులకు భద్రత కరువైందని అన్నారు. ఆదాయంపై మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల(ఎంవీఐ)కు టార్గెట్లు పెట్టే అధికారులు..

రక్షణ కల్పించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనిఖీల సమయంలో ఒక్కో ఎంవీఐకి లైసెన్స్ తుపాకీ సమకూర్చడంతో పాటు 15-20 మంది సపోర్టింగ్ సిబ్బంది, సివిల్ కానిస్టేబుల్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రాణాలకు తెగించి ఎర్రచందనం, కలప, ఇసుక, మద్యం మాఫియాలను ఎంవీఐలు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జోనల్ పోస్టులన్నీ తెలంగాణ వారికే దక్కాలన్నారు. సమావేశంలో జేఏసీ నగర కన్వీనర్ కృష్ణయాదవ్, ఆర్టీఏ ఉద్యోగులు శ్రీనివాస్‌డ్డి, పురుషోత్తండ్డి, ఓం ప్రకాశ్, నర్సింహులు, సుభాష్, మల్లికార్జున్, కృష్ణవేణి, శంకర్ నారాయణ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.