టీ ఉద్యోగులను తీసుకొచ్చిన వెహికిల్స్ డ్రైవర్లంత మందికూడా ఏపీఎన్జీవోల సభకు రాలేదు-కేసీఆర్

ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన సభ గొప్పది కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యోగ గర్జనకు తెలంగాణ ఉద్యోగులను తీసుకొచ్చిన వెహికిల్స్ డ్రైవర్లంత మంది కూడా సేవ్ ఏపీ సభకు రాలేదని కుండబద్దలుకొట్టిన్రు. ఏపీ ఎన్జీవోల ప్రవర్తను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర ఉద్యమంలో నాయకుల ప్రవర్తన జుగుప్సాకరం అని విమర్శించారు. ఏపీ ఎన్జీవోల లాంటి సభలు తెలంగాణలో ఎన్నో జరిగాయని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
త్వరలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ సభ అన్ని జేఏసీలను సమన్వయం చేసుకుని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సభా నిర్వహణపై చర్చిస్తామని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.