టీవీ9 రవిప్రకాష్ పై చెప్పుతో దాడి

టీవీ9 సీఈవో రవిప్రకాష్ కు ఘొరాతిఘోరమైన పరాభవం జరిగింది. తెలంగాణ ప్రజలతో పాటు  సీమాంధ్ర ప్రజలు, ఎన్నారైలు, స్టార్ నైట్ ద్వారా వచ్చిన పైసలు, ప్రభుత్వం,  హౌసింగ్ బోర్డు సహకారంతో కర్నూలు వరదబాధితుల కోసం ప్రజానగర్-2 లో ఇళ్లు నిర్మించిన్రు. ప్రజానగర్ -2 ఓపెనింగ్ సందర్భంగా రవిప్రకాష్ పై టీవీ9 మాజీ ఉద్యోగి ఆళ్లగడ్డ స్ట్రింగర్ రమణ చెప్పుతో దాడి చేసిన్రు. నీతులు చెప్పడం కాదు.. నీతిగా బతకడం నేర్చుకోండంటూ  రవిప్రకాష్ ను కొట్టిన్రు. దీంతో రెచ్చిపోయిన టీవీ9 సిబ్బంది (అంతరంగమేంటో తెలియదుగానీ) రమణపై విచక్షణారహితంగా దాడిచేసిన్రు.  ఫ్యాక్షనిస్టులకంటే క్రూరంగా ప్రవర్తించి రమణను కొట్టారని ప్రత్యక్షసాక్ష్యులంటున్నరు. కొట్టింది తమ మాజీ ఉద్యోగే అయినప్పటికీ రవిప్రకాష్ మాత్రం ఫ్యాక్షనిస్టులకు భయపడేదిలేదని, పాత్రికేయ స్వేచ్ఛను ఎవరూ హరించలేరని.. దాడిని టీవీ9 సిబ్బంది సమర్థవంతంగా తిప్పికొట్టింది (దాడికి పాల్పడ్డారని) ఉపన్యసించిన్రు.  పోలీసుల అదుపులో ఉన్న రమణను తమకు అప్పగించాల్సిందిగా రజనీకాంత్ పోలీసులకు హుకుం జారీ చేసిండు. రవిప్రకాష్ తో తన భర్తకు ప్రాణహాని ఉందని రమణ భార్య ఆందోళన వ్యక్తం చేసిన్రు. రమణను చంపే అవకాశం ఉందని ప్రాణాలతో అప్పగించాలని.. రమణ తల్లి అన్నరు

 

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.