టీవీ 9పై చర్య తీసుకోవాల్సిందే

తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కార్యక్రమం ప్రసారం చేసిన టీవీ 9 చానల్‌పై చర్యలకు రంగం సిద్ధమైంది. శాసనసభ్యుల పట్ల అభ్యంతరకర భాషను వాడుతూ టీవీ 9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీ దష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శనివారం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సదరు చానల్‌పై కఠిన చర్య తీసుకోవాలని అన్ని పార్టీల సభ్యులు సూచించించారు. దీంతో టీ బ్రేక్ సమయంలో అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు అన్నిపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. టీవీ కార్యక్రమంలో వాడిన భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. అవమానకర రీతిలో ప్రసారాలు చేసిన చానల్‌పై చర్య తీసుకునే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులన్న గౌరవం లేకుండా ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేసిన చానల్‌పై అసెంబ్లీ చట్టాల ప్రకారం స్పీకర్, చైర్మన్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.