యాడ్స్ అరాచకం నుంచి బయటపడగలిగాం.. జై ట్రాయ్

సంధిసుదలు, రుద్రాక్షలు.. అష్టకల్ప మూలికలు,  యంత్రాలు, మంత్రాలను అర్ధగంటలకు, అర్ధగంటలు చూసే బాధ నుంచి మనకు విముక్తి లభించింది. రెండున్నర గంటల సినిమాను 4 గంటలు చూపెట్టే ఎంటర్ టైన్ మెంట్ చానళ్లకు డ్రాడ్ కాస్టింగ్ ఫెడరేషన్ చెక్ పెట్టింది.  ఇకపై గంటకు 12 నిమిషాలే వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయాలని పరిమితి విధించింది. ఈ మార్పులు అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రేక్షకులకు సినిమాలను హ్యాపీగా చూడొచ్చు.. మనం కూడా యాడ్స్ మధ్యలో వార్తలు కాకుండా.. వార్తల మధ్యలో యాడ్స్ చూడొచ్చు. ఈ నిబంధనలకు ప్రాథమికంగా టీవీ చానళ్ల యాజమాన్యాలు అంగీకారం తెలిపినయి. ఈ చట్టం 8 ఏళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించిందని.. టీవీ పరిశ్రమ నిలదొక్కుకునేందుకు నిబంధనలు అమలు చేయలేదని భారతీయ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శైలేష్ షా తెలిపిన్రు. ఈ చట్టం వల్ల వాణిజ్య ప్రకటనదారులు, ఏజెన్సీలు, టీవీ చానళ్లు ఇబ్బందులు పడినా, డిజిటలైజేషన్ వల్ల సబ్‌వూస్కిప్షన్ ఆదాయం పెరుగుతుందని చెప్పిన్రు. ఇక మీదట నొప్పిని జయించగలిగాం.. జై సంధిసుధ నుంచి విముక్తి కలిగి.. యాడ్స్ అరాచకం నుంచి బయటపడగలిగాం.. జై ట్రాయ్.. అని అందాం..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.