టీడీపీ 420 పార్టీ -ఈటెల

 

etela చీకటి ఒప్పందాలతో బతుకుతున్నది : ఈటెల
టీడీపీ ఒక 420 పార్టీ అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అభివర్ణించారు. కాంగ్రెస్ తోక పార్టీగా మారి చీకటి ఒప్పందాలు చేసుకుని బ్రతుకుతున్న పార్టీ అని ద్వజమెత్తారు. గతంలో నామా నాగేశ్వర్‌రావు, సుజనా చౌదరిపై ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతిలో అవినీతి కథనాలు వచ్చాయని, వారిని పార్టీ నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు పంపలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సభలో నోటీస్ ఇవ్వటాన్ని తప్పుబట్టారు. స్పీకర్‌కు ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభ్యుడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన టీడీపీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు చెప్పారు.

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పలువురు మరణవాగ్మూలాల్లో పేర్కొంటే సిగ్గులేకుండా టీఆర్‌ఎస్ పార్టీ వల్ల చనిపోయారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులపై ఏసీబీ, సీబీఐ, సీఐడీ ఏ దర్యాప్తు సంస్థతో విచారణకైనా చేసిన కేసీఆర్ సిద్దం చంద్రబాబు సిద్దంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. టీడీపీ పార్టీదే దొంగ చరిత్ర అన్నారు. టీడీపీఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నారని, మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి దొంగ సర్టిఫికెట్‌తో ఎన్నికైనందున సుప్రీం కోర్టు ఎన్నిక చెల్లదని వేతనం రికవరీ చేయాలని ఆదేశించిందని చెప్పారు. రంగాడ్డి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసులు ఉన్నాయి. వారిది నీతి మంతులు పార్టీ అయితే వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు’ అని ఈటెల ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.