టీడీపీ తెలుగు దళారుల పార్టీగా మారింది: కేటీఆర్

హైదరాబాద్: టీడీపీ తెలుగు దళారుల పార్టీగా మారిందని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదిర్చేందుకు తెలంగాణ టీడీపీ నేతలు దళారుల పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. మా పార్టీ వ్యవహారంపై సలహాలు, సూచనలు అవసరం లేదన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా టీటీడీపీ నేతల వ్యవహారం ఉందన్నారు. విడిపోవడానికి ఏకాభిప్రాయం కోరే చంద్రబాబు… కలిసి ఉండేందుకు ఏకాభిప్రాయం అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బాబుకు రాజకీయంగా మిగిలేది కొబ్బరి చిప్పలేనన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.