టీడీపీతో పొత్తు వద్దేవద్దు-రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరిన బీజేపీ తెలంగాణ నేతలు

హైదరాబాద్, జనవరి 9 : ‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోవద్దు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ పార్టీ తెలంగాణ నేతలు మరోసారి కోరారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను హోటల్ కత్రియాలో తెలంగాణ నేతలు గురువారం ఉదయం కలిశారు. ఈ సందర్బంగా ఐదు పేజీల నివేదికను ఇచ్చారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ నివేదికలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను పొందుపరిచారు. గతంలో పొత్తు కుదుర్చుకోవడం వల్ల కలిగిన నష్టాలను ఏకరువు పెట్టారు. సొంతంగా పోటీచేసిన సమయంలో పెరిగిన ఓట్ల శాతాన్ని, టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో ఓట్లు తగ్గిన విషయాన్ని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ క్రియాశీలంగా పాల్గొనందున ఈ ప్రాంతంలో ఆదరణ పెరిగిందని, ఈ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటే.. బీజేపీకి పూర్తిగా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం చాలా తక్కువని, అలాంటప్పుడు టీడీపీ పొత్తుతో తమకు కలిగే లాభం శూన్యమని పేర్కొన్నారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇటీవల ఆ పార్టీని వీడిన విషయాన్ని రాజ్‌నాథ్‌కు తెలిపారు. తెలంగాణ ఏర్పడితే.. ఈ ప్రాంతంలో టీడీపీ అనే పార్టీ ఉండదని, రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి ఇదే మంచి అవకాశమని ఆయన దృష్టికి తెచ్చారు. ఇక పార్టీలో కొందరు నేతలు గుదిబండగా మారారని, అటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వవద్దని కోరారు. కొత్త వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి లాభం కలుగుతుందని అధ్యక్షుడుకి వివరించారు. 1999లో టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో గెలిచిన 12 స్థానాల్లో ఏ ఒక్క స్థానం, 2004లో గెలవని విషయాన్ని నివేదికలో పొందుపరిచారు.
పొత్తుంటుందని చెప్పలేదే!: రాజ్‌నాథ్‌సింగ్
తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుంటున్నట్టు ఎక్కడా చెప్పలేదని, దీనిపై మీరెందుకు ఆందోళన చెందుతున్నారని రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ నేతలను ఎదురు ప్రశ్నించారు. పొత్తు అంశంలో ఇప్పటివరకూ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల విషయం తమకు తెలిసిందన్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, కష్టపడండి, ఫలితం సాధించండి అని నేతలకు ఉద్బోధించారు. ఆయనను కలిసిన వారిలో బీజేపీ శాసనసభా పక్షనేత యెండెల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నేతలు నరహరి వేణుగోపాల్‌డ్డి, ప్రేమేందర్‌డ్డి ఉన్నారు.
బీజేపీలో చేరిన అంజిడ్డి
మెదక్ జిల్లా పటాన్‌చెరువుకు చెందిన అంజిడ్డి బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలో అంజిడ్డి క్రియాశీలంగా పనిచేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. బీజేపీ నుంచి పటాన్‌చెరువు స్థానాన్ని అంజిడ్డి ఆశిస్తున్నారని సమాచారం.
-అతి ధీమా వద్దు!
-బీజేపీ శ్రేణులకు ఆర్‌ఎస్‌ఎస్ దిశానిర్దేశం

దేశంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున కచ్చితంగా అధికారంలోకి వస్తామని అతిగా ధీమా వద్దని బీజేపీకి ఆ పార్టీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ సూచించింది. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆరెస్సెస్.. ఆప్‌ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పింది. ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత స్థాయి సమావేశాలు మూడు రోజులుగా హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్‌పేటలో జరుగుతున్నాయి. చివరిరోజైన గురువారం జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వారికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ దిశానిర్దేశం చేశారు. దేశంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని జాగ్రత్తగా నడిపించాలని భగవత్ సూచించారు. వచ్చే ఎన్నికలపై ఆరెస్సెస్ అభివూపాయాలను తీసుకున్న రాజ్‌నాథ్ ఎన్నికల్లో పార్టీ తరఫున చేపట్టనున్న అన్ని విషయాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలు పార్టీకి సహకరించే అం శంపై ఈ సమావేశం నుంచి ఆదేశాలు వెళ్తాయని తెలుస్తోంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.