టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుగుదేశం పార్టీ గుర్తించనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 1999 నుంచి నాయకత్వం ఆలోచనలో మార్పు వచ్చిందని, పార్టీ నాయకుడు కార్పోరేట్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పార్టీలు మారేవారికే పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అందుకే 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. ఈ ఓటములపై పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడంలేదని ధ్వజమెత్తారు. పార్టీ నాయకత్వంలో చాలా లోపాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంట్ స్థానాలకు 12 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు లేరని తెలిపారు. 117 అసెంబ్లీ స్థానాలకు గాను 60 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు లేరని సంస్థాగత నిర్మాణం లోపించిందన్నారు. పార్టీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పడం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేక తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ఎప్రిల్ 29న చంద్రబాబును కలిసినప్పడు తెలంగాణ ఉద్యమం చెద్దామని, పార్టీ పరంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమానికి ఫ్రోగ్రాం చేయాలని అడిగితే ఇప్పటి వరకు నాయకత్వం నుంచి ఎటువంటి సమాదానం లేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడే వారిని పార్టీ నుంచి పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.