టీఈఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో లండన్‌లోతెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

ప్రపంచవ్యాప్తంగా తొలిసారి తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఈఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం లండన్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫోరం వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్, అనిల్ కుర్మాచలం ఆవిష్కరించారు. ఈ కార్యక్షికమానికి సభాధ్యక్షుడిగా రంగుల సుధాకర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్, అనిల్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తెలంగాణ ఎన్నారైలలో ఉత్సాహాన్ని, ఉద్యమస్ఫూర్తిని నింపిందన్నారు.
అనంతరం టీఈఎన్‌ఎఫ్ వార్షికోత్సవ సభలు కొనసాగాయి. భవిష్యత్ కార్యక్షికమాలను సిక్కి చందూగౌడ్ వెల్లడించారు. మహిళా విభాగానికి చెందిన పవివూతడ్డి, అర్చన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొదటివార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఐదుగురు పేద ముస్లింలకు హజ్‌యావూతకు ఆర్థికసహాయం చేయనున్నట్లు, పేద విద్యార్థులకు 5000 నోట్‌బుక్‌లు అందించనున్నట్లు, మెదక్ జిల్లా సిద్దిపేట్‌కు చెందిన వెంకటాపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఉదయ్‌నాగరాజు వెల్లడించారు. బెహరాన్, సింగపూర్, అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లో కూడా టీఈఎన్‌ఎఫ్ స్థాపనకు కృషిచేయనున్నట్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీవడ్డిరాజు వెంక మాట్లాడుతూ తెలంగాణ వాదులు చేస్తున్న కార్యక్షికమాలను అభినందించారు. కార్యక్షికమంలో చందు, శ్యాంపిట్ల, షిండే శివాజీ, ప్రమోద్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.