టీఆర్‌ఎస్ స్వీయ రాజకీయశక్తిగా ఎదగితేనే తెలంగాణ సాధ్యం-కేసీఆర్‌

kcrr

– వచ్చే ఎన్నికల్లో ఆలోచించి అస్త్రాలు సంధిద్దాం
– అన్ని సీట్లు మనమే గెలుచుకుందాం
– కమాండ్ చేసి.. డిమాండ్ చేసి తెలంగాణ తెచ్చుకుందాం
– మనకు ఆంధ్రా పార్టీలు అవసరమా?
– కరీంనగర్ కదనభేరీలో టీఆర్‌ఎస్ అధినేత
– బాబూ.. నీకు నీతీ జాతీ ఉన్నాయా?
– మే సగం నెల నాటికి టీడీపీని సగం నాశనం చేస్తాం
– టీడీపీ నుంచి చాలా మంది టచ్‌లో ఉన్నారు
– కిరణ్‌కుమార్‌రెడ్డీ.. నీవు ముఖ్యమంత్రివేనా?
– అసెంబ్లీ సాక్షిగా తెలంగాణను అవమానిస్తావా?
– గనులపై తెలంగాణకో న్యాయం.. సీమాంధ్రకో న్యాయమా?.. నిప్పులు చెరిగిన కేసీఆర్
– భారీ బహిరంగ సభ సాక్షిగా టీఆర్‌ఎస్‌లోకి గంగుల

‘తెలంగాణలోని తల్లులకు, చెల్లెండ్లకు, బిడ్డలకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు యావత్తు తెలంగాణ బిడ్డలకు మీ బిడ్డగా అప్పీలు చేస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి స్వీయ రాజకీయశక్తిగా ఎదిగినప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసి తీసుకోవచ్చు..’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేసినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అసలు సిసలైన అస్త్రాన్ని సంధించాలన్నారు. రాబోయేది సంకీర్ణ రాజకీయ యుగమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో అధిక సీట్లను మనమే గెలుచుకుంటే మన మద్దతు లేకుండా ఎవరూ అధికారంలోకి రాలేరని చెప్పారు. గురువారం కరీంనగర్ సర్కస్ మైదానం (కిష్టయ్య ప్రాంగణం)లో ‘కరీంనగర్ కదనభేరి’ పేరుతో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్‌ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌డ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. కమలాకర్‌కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కమలాకర్ అనుచరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. సభలో కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘తెలంగాణ సాధన కోసం చేయని ఉద్యమం లేదు.. ధర్నాలు చేశాం.. రాస్తారోకోలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం.. సకల జనుల సమ్మెచేశాం. అన్నిరకాల ఉద్యమాలు చేశాం.. ప్రపంచంలోనే అద్భుతమైన పోరాట ప్రతిమను ఆవిష్కరించాం. ఇన్నిచేసినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఒక్కోసారి అనిపిస్తుంది.. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని? దున్నపోతు మీద వర్షం పడినట్లుగా మన కేంద్రం, ప్రధాని పరిస్థితి ఉంది. వేలాది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే.. కేంద్రం మాత్రం తెలంగాణను తేల్చకుండా మొండిగా వ్యవహారిస్తోంది. రాబోయేది సంకీర్ణ రాజకీయ యుగమే. ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఈ దేశంలో లేదు. తెలంగాణలో అన్ని సీట్లను మనమే గెలుచుకుంటే మన మద్దతు లేకుండా ఎవరూ అధికారంలోకిరారు’ అంటూ ఉద్బోధించారు.

ఈ విషయాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ గుర్తించి మసలుకోవాలని, ఎన్నికలు రాగానే ఆగం ఆగం కావద్దని సూచించారు. ‘మీకు తెలుసు.. ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ నాయకులు తమ పదవులను గడ్డిపోచల్లా వదిలేశారు. ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్ని చేసినా తెలంగాణ రాలేదు. తెలంగాణ రావాలంటే మనమంత ఏమిచేయాలి? మన కర్తవ్యం ఏమిటి.. అన్నది మనం గుర్తించాల్సిన సమయం వచ్చింది. అందుకే తెలంగాణలోని ప్రతి ఉద్యకారుడికి, ప్రతి బిడ్డకు, ప్రతి మేధావికి ఇతరులకు మీ బిడ్డగా అప్పీలుచేస్తున్నా. ఎన్నికలు రాగానే అసలు సిసలైన అస్త్రాన్ని ఆలోచించి వినియోగించాలి’ అని సూచించారు.
kcr
బాబూ.. నీకు నీతిజాతి ఉందా?: ‘వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఏమి చెపుతోంది. జగన్ బాబు వస్తారు పోలవరం కడుతారని?. చంద్రబాబు అదే కోవకు చెందినవారే’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, పోతిడ్డిపాడును ఎలా సమర్థిస్తారంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఏ అనుమతి లేకుండా 1500 మంది సాయుధ బలగాలను పెట్టి నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులను ఈ పార్టీలు సమర్థిస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘చంవూదబాబూ.. నీకు నీతిజాతి ఉందా? నీ పార్టీ కూలిపోయి నీరసపడింది. ఇంకా కుంగదీస్తాం.. మే సగం నెల నాటికి సగం నాశనం చేస్తాం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరిక ఒక ప్రారం భం మాత్రమే. చాలా మంది నాతో టచ్‌లో ఉన్నారు. చాలా మంది ని చేర్చుకుంటాం..’ అని తేల్చిచెప్పారు. ‘నన్ను చంద్రబాబు దేశ ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ వనరుల గురించి, పోతిడ్డిపాడు గురించి ప్రశ్నిస్తే నేను తెలంగాణ ద్రోహిలాగా కనిపిస్తున్నా నా?’ అంటూ ప్రశ్నించారు. ఎవరూ ఎన్ని తిట్టినా.. ఉద్యమాన్ని మొండి పట్టుదలతో ముందుకు తీసుకెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆంధ్రా పార్టీలు అవసరమా?: ‘ఒక అంశంపై మన ఎమ్మెల్యే హరీష్ అసెంబ్లీలో ప్రశ్నిస్తే సీఎం లేచి ఒక్క పైసా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో అన్నారు. తెలంగాణకు ఇంత అవమానమా? కిరణ్‌కుమార్‌డ్డీ.. నీవు ముఖ్యమంవూతివేనా? రాజ్యాంగం ముందు ఏమని ప్రమాణం చేసావు? అన్ని ప్రాంతాలు నీకు సమానం కాదా..? ఇంత అహంకారపూరిత మాటపూందుకు నీకు? దురుసుగా సీఎం మాట్లాడితే ఇతర పార్టీల నోళ్లు ఎందుకు పెగలలేదు. ఒక్క టీఆర్‌ఎస్ మాట్లాడాలా? ఏమిటీ ఇతర పార్టీల లాలూచీ? నోరు తెరవని దద్దమ్మలు, ప్రశ్నించే సత్తాలేని నాయకులున్నంత వరకు తెలంగాణ ఇట్లానే ఉంటుంది. కదనభేరి సాక్షిగా మీ అందరిని ఒక ప్రశ్న అడుతున్నాను? ఈగడ్డమీద ఇంకా ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరమా? మీరు సమాధానం చెప్పాలి..’ అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ‘తెలుగుదేశం పార్టీ జీవితకాలం మొత్తంలో ఏ తెలంగాణ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి అవుతాడా? కనీసం ఫ్లోర్ లీడర్ అవుతారా? పార్టీ అధ్యక్షుడు అవుతారా?’ అంటూ జనంనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 57ఏళ్ల పాలనలో తెలంగాణవాళ్లు ముఖ్యమంవూతులుగా ఉన్నది కేవలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమేనని గుర్తుచేశారు. ఒకవేళ తెలంగాణవాళ్లు ముఖ్యమంత్రి అయితే ఆరు నెలలకు తిరగక ముందే వారిని ముప్పుతిప్పలు పెట్టి దించేస్తారని, అంతెందుకు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చెందిన వారు? పీసీసీ అధ్యక్షుడు, శానసభసభ స్పీకర్, చివరకు మండలి చైర్మన్ కూడా ఏ ప్రాంతానికి చెందినవారు అంటూ ప్రశ్నించారు.

గనుల కేటాయింపుల్లోనూ వివక్ష: బయ్యారం గనుల కేటాయింపులోనూ కాంగ్రెస్ సర్కారు పక్షపాతం చూపిందని కేసీఆర్ మండిపడ్డారు. జాతీయ ఖనిజ సంస్థ రాష్ట్రంలోని ఐదుగనులు కావాలని కోరగా అందులో అనంతపురం జిల్లా రాయదుర్గంక ఓబుళాపురం గనులు కూడా ఉన్నాయని, కానీ.. వాటిని అక్కడ పెట్టి.. తెలంగాణలోని ఇనుప గనులను విశాఖకు కేటాయించారని మండిపడ్డారు. అంటే ఇక్కడ కూడా తెలంగాణకు ఒక న్యాయం సీమంవూధాకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ‘ఇటీవల మళ్లీ చిలుక పలుకులు పలుకుతున్నారు. బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామంటూ నమ్మిస్తున్నారు. అదే నిజం అయితే ఇక్కడి ఖనిజ సంపదను ఎందుకు విశాఖకు తరలిస్తున్నారు? ఇప్పటికే అన్నీ దోచుకున్నారు. సర్వనాశం చేశారు. ఇన్నీ తెలిసి ఇంకా అమాయకంగా ఉందామా?’ అంటూ తెలంగాణ ప్రజలకు సూచించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే కావాలని, తెలంగాణ రాష్ట్ర సమితి స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలని, తెలంగాణ సాధించుకొని తీరాలంటే అంతకు మించిన గత్యంతరం మరొకటి కనిపిచడం లేదని కేసీఆర్ అన్నారు.స్వీయ రాజకీయశక్తిగా ఎదిగితే కమాండ్,డిమాండ్ చేసి శాసించి తెలంగాణ తెచ్చుకోవచ్చని సూచించారు.

నారదాసుకు ఎప్పటికీ సముచిత స్థానమే: ‘కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పార్టీలో చేర్చుకుంటే మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుకు అన్యాయం జరిగినట్లుగా కొన్ని సీమాంధ్ర మీడియాలు వక్రీకరిస్తున్నాయి. నారదాసుకు పార్టీలో ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుంది. పసుపు కండువాను వీడి.. తెలంగాణకోసం వచ్చిన గంగుల కమలాకర్‌ను వచ్చే ఎన్నికల్లో 60-70వేల మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కదనభేరి సభకు ప్రాంగణానికి అమరడైన కిష్టయ్య పేరు పెట్టినందుకు ఆయన టీఆర్‌ఎస్ శ్రేణులను అభినందించారు. కిష్టయ్య కుటుంబానికి అండగా ఉంటామని, అతి త్వరలోనే రూ. 10లక్షలు వెచ్చించి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. ఆ ఇంటి ప్రారంభానికి తానే వస్తానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల హక్కుల పూర్తిగా రక్షించబడుతాయని, వారికి ఉన్నతస్థానం కల్పిస్తామని, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కార్యక్షికమంలో జిల్లా ఇన్‌చార్జి వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఉప నేత హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, సోమరాపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, రమేశ్‌రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీలు స్వామీగౌడ్, పాతూరి సుధాకర్‌డ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.