రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంలో టీఆర్ఎస్ వేగం పెంచింది. కాంగ్రెస్, టీడీపీలకంటే ముందే ఉంటూ.. శుక్రవారమే 69మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్, శనివారం 8 లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ప్రస్తుతం ప్రకటించినవారిలో 8 మందికిగాను ఏడుగురు గతంలో అభ్యర్థిత్వాలు ఖరారు చేసుకున్నవారే. సికింద్రాబాద్ స్థానానికి మాత్రం కొత్తవ్యక్తికి టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తూం భీంసేన్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ పడ్డారు. గతంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. వత్తిపరంగా తూం భీంసేన్ అడ్వకేట్.
పార్లమెంట్ అభ్యర్థులు
నాగర్‌కర్నూల్: మందా జగన్నాథం, మహబూబ్‌నగర్: ఏపీ జితేందర్ రెడ్డి, భువనగిరి: బూర నర్సయ్యగౌడ్, నల్గొండ: డాక్టర్ పల్ల రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్: కడియం శ్రీహరి, కరీంనగర్: బీ వినోద్‌కుమార్, చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సికింద్రాబాద్: తూం భీంసేన్.
అసెంబ్లీ అభ్యర్థులు
నిజామాబాద్ రూరల్: బాజిరెడ్డి గోవర్ధన్, మల్కాజిగిరి: సీహెచ్ కనకారెడ్డి, షాద్‌నగర్: అంజయ్య యాదవ్, కోదాడ: శశిధర్‌రెడ్డి.