టీఆర్‌ఎస్ తొలిజాబితా నేడే!

 టీఆర్‌ఎస్ పార్టీ తొలిజాబితాను అతి త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం జరిగే పార్టీ ఎన్నికల కమిటీ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ కూడా హాజరవనున్నారు. ఈ సమావేశాల్లోనే తొలిజాబితాలోని పేర్లను ఖరారు చేయనున్నారు. ఈ కమిటీలో వినోద్, కడియం శ్రీహరి, కేకే, నాయిని నర్సింహారెడ్డి తదితరులున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తొలిజాబితాను ప్రకటిస్తే అభ్యర్థులు ప్రచారబరిలో దిగుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం నాటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.