టీఆర్‌ఎస్ ఏ ఒత్తిడికి లొంగదు : కేటీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. గన్‌పార్క్ వద్ద టీఆర్‌ఎస్వీ చేపట్టిన ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నరు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిళ్లకు లొంగినా… టీఆర్‌ఎస్ ఏ ఒత్తిడికి లొంగదని తేల్చిచెప్పారు. రాయల తెలంగాణను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ఇస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్‌కు పరాభవమే అని చెప్పారు. రాయలసీమ వారితో తాము కలిసుండలేమని పేర్కొన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమనిస్తాని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.