టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహమూద్ ఆలీ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కోటాలో అభ్యర్థిగా ఆయన ఇవాళ తన నామినేషన్ పత్రాలను శాసన సభ కార్యదర్శికి సమర్పించారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, గంప గోవర్దన్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఇతర టీఆర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కాగా, ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా గెలిచి తీరుతామని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం: ఈటెల
ఎమ్మెల్యే కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మహమూద్ ఆలీకి మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను కలిశామని పేర్కొన్నారు. తెలంగాణ నగారా సమితి అధినేత నాగం జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి మహమూద్‌కు మద్దతు తెలపాలని కోరామని తెలిపారు. టీఆర్‌ఎస్ ఒక మైనారిటీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కలిపించి తెలంగాణ ఉద్యమానికి ముస్లిం సోదరుల మద్దతు కూడగట్ట గలిగిందని, అన్ని మతాలు, కులాలను గౌరవించే ఏకైక పార్టీగా నిలిచిందని ఈటెల అన్నారు.

Home >> >>
3/7/2013 3:57:23 PM

కేసీఆర్‌కు కృతజ్ఞతలు: మహమూద్
తనకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కలిపించిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మహమూద్ ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం పట్ల తెలంగాణ ముస్లిం లోకం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోందని ఆయన అన్నారు. తన గెలుపుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Other News
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.