టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు-శంకుస్థాపనను అడ్డుకునేందుకు యత్నించిన నేతలు

రాయదుర్గంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి చేతుల మీదుగా చేపట్టిన గేమింగ్ పార్కు శంకుస్థాపన కార్యక్షికమం తీవ్ర రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్షికమాన్ని అడుకొని.. నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. సీఎం కిరణ్ అక్రమంగా తెలంగాణ భూములను సీమాంవూధులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గేమింగ్ పార్కు శంకుస్థాపన విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, రాజయ్య, భిక్షపతి, నల్లాల ఓదెలు, ఇతర నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చొచ్చుకొచ్చారు. పోలీసు చెక్‌పాయింట్లను ఛేదించుకొని మరీ సభావూపాంగణం వైపు దూసుకువచ్చారు. మాదాపూర్ డీసీపీ రాణా, ఏసీపీ శ్రీధర్, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ బాలకోటి తదితరులు తమ సిబ్బందితో వారిని అడ్డుకున్నారు.
harish కారు దిగుతున్న ఎమ్మెల్యేలు హరీశ్‌రావు తదితరులను వెంటనే అదుపులోకి తీసుకుని.. బలవంతంగా పోలీసు వాహనాల్లో సమీపంలోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారసత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.. కానీ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి వాటిని భక్షించేవిధంగా ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆరేళ్లక్షికితం ఆ భూముల్లోని కొంతభాగాన్ని వేలంపాట ద్వారా కొనుగోలు చేసిన వారు అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీకి వెళితే ఇది హెరి భూమి మీకు అనుమతులివ్వమని చెప్పారు.

కేంద్రం పరిధి నుంచి డీనోటిపై అయిన తర్వాత ఇవ్వాలని అప్పట్లో కొనుగోలుదారులకు ప్రభుత్వం చెప్పింది. కానీ ఎలాంటి అనుమతులు లేకున్నా అదే భూమిలో సీఎం కిరణ్ శంకుస్థాన ఎలా చేశారు’ అని ఆయన ప్రశ్నించారు. హెరి భూములను సీమాంవూధులకు కట్టబె సీఎం కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ విషయై సీఎం కిరణ్, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అధికారులపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదుచేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి కొండకల్ శంకర్‌గౌడ్, శేరిలింగంపల్లి బీసీ సెల్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, రాష్ట్ర యువత విభాగం సెక్రటరీ జనరల్ కోమాండ్ల శ్రీనివాస్‌డ్డి, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శీతల్‌సింగ్, ఇతర నాయకులు, కార్యకర్తలు అరెస్టయిన వారిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సభలో ఏపీఐఐసీ డౌన్ డౌన్ అని నినాదాలిచ్చిన మై హోం ప్రతినిధి శశిధర్‌తోపాటు మరో ఆరుగురిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకుని 188 సెక్షన్ కింద కేసు నమోదుచేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.