టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు

TRS-quthbullapurటీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మెహన్ తెలిపారు. పార్టీని వీడుతున్నట్లు వచ్చిన కథనాలను వారు ఖండించారు. శనివారం టీ మీడియాతో వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని, వేల కిలోమీటర్లు, వందల గంటలు కేసీఆర్‌తో గడిపామని, కేసీఆర్‌కు రక్షణ కవచంగా పనిచేశామని, అలాంటి తాము పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మా జీవిత లక్ష్యమే తెలంగాణ. ఎమ్మెల్యే పదవుల కోసమో, ఎమ్మెల్సీ పదవుల కోసమో ఉద్యమంలోకి రాలేదు అ పేర్కొన్నారు. ఈ 14 ఏళ్లలో వందల బహిరంగ సభలను విజయవంతం చేశామని, ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కషి చేశామని తెలిపారు. కేసీఆర్‌ను టికెట్ అడిగిన మాట వాస్తవమేనని, క్షేత్రస్థాయి సర్వేలు అనుకూలంగా ఉన్నా కొన్ని దుష్ట శక్తులు కేసీఆర్ చుట్టూ చేరి టికెట్ రాకుండా అడ్డుకున్నాయని చెప్పారు. టికెట్ రానంత మాత్రాన పార్టీని వీడే నైజం తమది కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో తమది అన్నదమ్ములు, తండ్రీ కొడుకుల బంధమని, అది ఒక్కరోజులో విడిపోయేది కాదన్నారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటామని తెలిపారు. పార్టీ విత్తనానికి నీరుపోసి వక్షాన్ని, మహావక్షాన్ని చేశామని, అటువంటి మహావక్షాన్ని నరుక్కునే మూర్ఖులం కాదని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని, భవిష్యత్‌లో కూడా కేసీఆర్ నాయకత్వంలో, ఆయన నమ్మిన బంటులుగా ముందుకుసాగుతామని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతా:శంభీపూర్ రాజు
కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకుసాగుతానని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్న వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఎదుగుదలను చూడలేని దుష్టశక్తులు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామినవుతానని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.