టీఆర్‌ఎస్‌ను వీడను-సీమాంధ్ర మీడియా ప్రచారాన్ని నమ్మొద్దు

తన రాజకీయ జీవితంలో చంద్రబాబును ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని.. ఇక కలవడం మాటెలా వస్తుందని మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఇంచార్జీ లకా్ష్మడ్డి పేర్కొన్నారు. కొన్ని చానళ్లలో వస్తున్నట్లు తాను టీఆర్‌ఎస్‌ను వీడటం లేదని.. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2007లో తాను కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాననని, తన రాజకీయ కార్యక్షికమాలన్నీ కేసీఆర్ ఆదేశం మేరకే సాగుతున్నాయని చెప్పారు. తన వయస్సు 55సంవత్సరాలని, ఈ వయస్సులో పార్టీలు మారే ఆసక్తి, ప్రసక్తి ఉండబోదని పేర్కొన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సీమాంధ్ర మీడియాపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.