టార్గెట్ సోనియా!

 

sonia

– హిట్‌లిస్టులో చిదంబరం, షిండే, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్ సీఎంలు కూడా..
– ప్రధాన నగరాల్లో దాడులకు వ్యూహం
– పసిగట్టిన కేంద్ర నిఘా సంస్థలు
– ఏపీ సహా పలు రాష్ట్రాలకు హెచ్చరిక
– రాష్ట్ర నేతల్లో మొదలైన కలవరం

– దాడుల సమాచారం ఉందన్న షిండే
– కాంగ్రెస్ అధినేవూతితో భేటీ
– నేడు ఛత్తీస్‌గఢ్‌లోహోంమంత్రి పర్యటన
– దండకారణ్యంలో కూంబింగ్ ముమ్మరం
– 200 మంది మావోయిస్టులపై ఎఫ్‌ఐఆర్
ఛత్తీస్‌గఢ్‌లో మెరుపుదాడితో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన మావోయిస్టులు మరిన్ని దాడులకు వ్యూహ రచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి హిట్‌లిస్టులో యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఉన్నారని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఆమెతోపాటు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్‌రాయ్ తదితరులు ఉన్నట్టు ఆ సంస్థలు అలర్ట్ మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన ప్రజావూపతినిధులను కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టంచేయాలని సూచించినట్టు తెలిసింది. ఆంధ్రవూపదేశ్‌లోనూ దాడులకు అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం.

ఈనెల 25న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పక్కా వ్యూహంతో.. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై దాడి చేశారు. దీంట్లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ పీపీసీ అధ్యక్షుడు, ఆయన కుమారుడితో పాటు ఇరవై ఏడుమందిని హతమార్చారు. దీనిపై ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ కొన్నేళ్లుగా వెనకడుగులో ఉన్న మావోయిస్టులు ఈ దాడితో కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశారని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ దాడితో దేశం దృష్టిని ఆకర్షించిన మావోయిస్టులు.. మరిన్ని పెద్ద దాడులతో అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో ఉన్న మావోయిస్టు అగ్రనేతల ఫోన్‌లను ట్యాప్ చేయటం ద్వారా దాడుల విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. ఢిల్లీతోపాటు మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రవూపదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మావోయిస్టులు పంజా విసిరే ప్రమాదముందని పసిగట్టాయి. ఈ క్రమంలోనే కేంద్ర నిఘా సంస్థలు జాగ్రత్త అంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసు యంత్రాంగాలను హెచ్చరించాయి.

రాష్ట్ర నేతల్లో గుబులు…
పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కేంద్ర నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు అందిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ నేతల్లో గుబులు మొదలైంది. ప్రధానంగా గుంటూరు, వరంగల్, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన వేర్వేరు పార్టీల ప్రజావూపతినిధులు ఈ పరిణామాలతో తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళన మొదలైంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయా పార్టీల నాయకులకు సూచించినట్టు సమాచారం.

ముందుగా నిర్ణయించుకున్న కార్యక్షికమాలకు తగు భద్రత లేకుండా వెళ్లరాదని, ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఆయా నాయకులకు కల్పించిన భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉండవచ్చని భావిస్తున్న వారికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

మావోయిస్టులపై సీఆర్పీఎఫ్ దండయాత్ర
అడవుల్లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో బలగాలు మోహరించగా.. మరిన్ని బలగాలను వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రణయ్ సహాయ్ తెలిపారు. 85 బెటాలియన్లకు చెందిన 84వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజావూపతినిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వారి వ్యూహాన్ని తిప్పికొ సన్నాహాలు మొదలుపెట్టారు. దండకారణ్యంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

మావోయిస్టుల దాడిలో చనిపోయిన ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ తదితరుల చితాభస్మాలను గురువారం ఉత్తరవూపదేశ్‌లోని అలహాబాద్ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్షికమంలో యూపీ పీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి, కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రమోద్ తివారీ పాల్గొన్నారు.

సల్వాజుడుం.. పాప వ్యూహం: కిషోర్ చంద్రదేవ్
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పడ్డ సల్వాజుడుం అనేది పాప వ్యూహమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిషోర్ చంద్ర-దేవ్ అభివూపాయపడ్డారు. దీన్ని తాను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నట్లు గురువారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. మావోయిస్టు సమస్య సమాజిక ఆర్థిక కోణాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఛత్తీసగఢ్‌లో నాయకులకు భద్రత కరువైందని వ్యాఖ్యానించారు. నక్సలిజం అనేది శాంతి భద్రతల సమస్య కాదని ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ అన్నారు. అభివృద్ధిలో గిరిజనులు వెనుకబడిపోతున్నారని, అలా మొదలైన అసంతృప్తి నక్సలిజం పెరుగుతోందని అభివూపాయపడ్డారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని సూచించారు.

ఎన్‌ఏసీలో నక్సల్స్ సానుభూతిపరులు: బీజేపీ నేత అనంత్‌కుమార్
జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ)లో కొందరు నక్సల్స్ సానుభూతి పరులు ఉన్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్డీయే హయాంలో దేశంలోని 57 జిల్లాలకే పరిమితమైన నక్సల్స్.. ఇప్పుడు 250 జిల్లాలకు విస్తరించడానికి యూపీఏ విధానాలకే కారణమని విమర్శించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.