జోలికొస్తే ఖబడ్దార్

 

busss
– తెలంగాణ డ్రైవర్, కండక్టర్లపై దాడి హేయం
– దాడులకు ప్రతిదాడులు తప్పవు
– ‘విజయవాడ’ నిందితులను కఠినంగా శిక్షించాలి
– డిమాండ్ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు
– పది జిల్లాల్లో డిపోల ఎదుట గేట్ ధర్నా
దాడులకు ప్రతిదాడులు తప్పవని, తెలంగాణ ప్రజల జోలికొస్తే ఖబడ్దార్ అని టీఎంయూ, ఈయూ నేతలు హెచ్చరించారు. విజయవాడలో తెలంగాణలోని వరంగల్ జిల్లా తొర్రూరు డి పో చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్లపై లగడపాటి అనుచరులు దాడి చేయడాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా ఖండించారు. సోమవారం తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సు డిపోల ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. డ్యూటీలో ఉన్న వారిపై దాడడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణవ్యాప్తంగా ఆందోళన కార్యక్షికమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణకోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిని రెచ్చగొడితే సహించేది లేదన్నారు.

సీమాంధ్ర బుద్ధి చాటారు
వరంగల్, తొర్రూరు, మహబూబాబాద్ డిపోల ఎదుట కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. మద్యం మత్తులో డ్యూటీలో ఉన్న డ్రైవర్, కండక్టర్లను గాయపరిచి సీమాంధ్ర బుద్ధిని చాటుకున్నారని మండిపడ్డారు.నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి డిపోఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. టీఎంయూ ఆధ్వర్యంలో కరీంనగర్-1డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. రీజియన్ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌రావు మాట్లాడుతూ దాడిచేసిన వారిని శిక్షించాలని, లేదంటే ఆంధ్రా బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, షాద్‌నగర్‌లో గేట్ ధర్నా చేపట్టారు. మెదక్‌లో టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మార్‌కే రావు, జిల్లా కన్వీనర్ పీఎస్‌డ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి శాఖయ్య, నారాయణఖేడ్‌లో టీఎంయూ డిపో కార్యదర్శి నెహ్రూ, జోనల్ కార్యదర్శి బాబర్‌మియా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో డిపో మేనేజర్ కార్యాయం ఎదుట ఈయూ, బోధన్ డిపో ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. లగడపాటి దిష్టిబొమ్మ దహనం చేశారు. బాన్సువాడ డిపో ఎదుట టీఎంయూ, ఈయూ, కామాడ్డి డిపో ఆవరణలో కార్మికులు నిరసన తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ సిటీ డిపో, హైదరాబాద్-2 డిపోల టీఎంయూ ఐక్యకూటమిల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్షికమాలు నిర్వహించి రాజీవ్‌చౌక్ వద్ద ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఎంయూ, ఈయూ హయత్‌నగర్ డిపో-1, 2 ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కూకట్‌పల్లి డిపో ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు గేట్ మీటింగ్‌ను నిర్వహించారు.

జరిగింది ఇదీ..
తొర్రూరు డిపో నుంచి ఆదివారం మధ్యాహ్నం తిరుపతికి బస్సు బయల్దేరింది. విజయవాడకు మూడు కిలోమీటర్లు దూరంలో భవానీపురం వద్ద కారులో(ఏపీ16 బీసీ 8177)లో ఐదుగురు, బైక్‌పై మరో ఇద్దరు కర్రలు, రాడ్లతో డ్రైవర్ జనార్దన్, కండక్టర్ కృష్ణయ్యలపై దాడిచేశారు. అందరూ వరంగల్ వాళ్లే అంటూ ప్రయాణికులపైనా దాడి చేశారు. ఆ ఏడుగురు మద్యం తాగి క్రూరంగా ప్రవర్తిస్తుండటంతో ఎవరూ అడ్డుకోలేకపోయారు. స్థానికుల సమా చారంతో విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కండక్టర్, డ్రైవర్‌ను ఆస్పవూతికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకోగా తాము ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరులమని, తమనే అరెస్టు చేస్తా అంటూ స్టేషన్‌లో వీరంగం సృష్టించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.