బిల్లొచ్చిందోచ్

హైదరాబాద్, డిసెంబర్ 12: సొంత రాష్ట్ర సాధన ఉద్యమ చరివూతలోనే అత్యంత కీలకమైన, అపురూపమైన సందర్భానికి తెలంగాణ సమాజం చేరుకున్నది. దశాబ్దాల పోరాటాల ఫలించి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు గురువారం సాయంత్రం రాష్ట్రానికి అందింది. తెలంగాణ ప్రక్రియ వాయువేగంతో దూసుకెళుతున్నదనేందుకు సూచికగా.. ముసాయిదా బిల్లు ప్రతులు ఢిల్లీ నుంచి గగన వీధుల ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్నాయి. బీఎస్‌ఎఫ్ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాక్షిశయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్.. సరిగ్గా సాయంత్రం 6.10 గంటలకు సచివాలయానికి వచ్చారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖతోపాటు ఎనిమిది బండిళ్లను సీఎస్ పీకే మహంతికి అందజేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీ అభివూపాయాన్ని 2014 జనవరి 23లోపు సేకరించి, 26 కల్లా తనకు తిరిగి పంపించాలని రాష్ట్రపతి గడువు విధించిన సంగతి సదరు లేఖలో ఉన్నట్లు సమాచారం. బుధవారం రాత్రే రాష్ట్రపతి నుంచి హోంశాఖకు అందిన ముసాయిదాను రాష్ట్ర శాసనసభకు పంపేందుకు అనువుగా తగిన జిరాక్స్ సెట్‌లతో హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే సిద్ధం చేయించారని సమాచారం.

ఆ మేరకు సురేశ్‌కుమార్ రాష్ట్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు అందించేందుకు వీలుగా 390 కాపీలను తీసుకువచ్చారు. సీఎస్‌కు కాపీలు అందించిన తర్వాత అటు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్ నరసింహన్‌ను కలిసి.. ముసాయిదా బిల్లు ప్రతిని స్వయంగా అందజేశారు. అక్కడి నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకుని.. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు బిల్లు ప్రతులను అందించారు. తన పనిని రెండు గంటల్లో ముగించుకున్న ఆయన వచ్చిన విమానంలోనే తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. తనకు చేరిన 120 పేజీలతో కూడిన ముసాయిదా బిల్లును ఇంగ్లిష్ నుంచి తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించేందుకు రాజాసదారాం చర్యలు తీసుకున్నారు. మరోవైపు తనకు అందిన రాష్ట్రపతి లేఖ, ముసాయిదా బిల్లును తీసుకుని సీఎస్ పీకే మహంతి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని కలుసుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి నలుగురు కీలకమైన వ్యక్తులకు బిల్లు ప్రతులు అందిన నేపథ్యంలో ఇక శుక్రవారం జరుగుతుందని భావిస్తున్న బీఏసీ సమావేశం అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో దానిపై ఎప్పుడు చర్చ జరిపేదీ మూడు రోజుల్లో నిర్ణయించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆరువారాల్లో బిల్లుపై అభివూపాయాన్ని పంపించాలని సూచించినా అంతకంటే ముందే పంపటం వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షతోపాటు..

రాష్ట్రపతిని కూడా గౌరవించినట్టు అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే బిల్లుపై చర్చించి.. అభివూపాయాన్ని రాష్ట్రపతికి నివేదించేందుకు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. శుక్రవారం సాయంవూతానికల్లా ముసాయిదా బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందించాలని రాష్ట్రపతి భవన్ నుంచి ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. స్పీకర్ కార్యాలయానికి కూడా ముసాయిదా అందినందున ఆయన దానిని వెంటనే పరిశీలించి.. బీఏసీ సమావేశాన్ని శుక్రవారమే ఏర్పాటు చేస్తారని అంటున్నారు. బీఏసీలో సభ్యులుగా ప్రస్తుతం తెలంగాణ వారే అధికంగా ఉండటం విశేషం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మొదలుకుని.. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్షికమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, విప్‌లు ఆరేపల్లి మోహన్, ఐ అనిల్‌లు అధికార పక్షం నుంచి బీఏసీ సభ్యులుగా ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఈటెలరాజేందర్, హరీశ్‌రావు, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ, సీపీఐ నుంచి గుండా మల్లేశ్ తెలంగాణ ప్రాంతంవారే. సీపీఎంకు ఉన్న ఏకైక సభ్యుడు జూలకంటి రంగాడ్డి కూడా తెలంగాణ ప్రాంత సభ్యుడే. వీరంతా ముసాయిదా బిల్లుపై తక్షణం చర్చకు పట్టుపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

టీడీపీ నుంచి బీఏసీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు కూడా అదే అభివూపాయం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి చంద్రబాబు మార్గనిర్దేశం ఎలా ఉంటుందన్నది కూడా ప్రశ్నే. లోక్‌సత్తా అధ్యక్షుడు జయవూపకాశ్ నారాయణ్ కూడా నగరంలోని కూకట్‌పల్లి నుంచి ఎన్నికైనవారే. ఆయన ఏ అభివూపాయం చెబుతారన్నది సందేహం. ఆయన చర్చను వ్యతిరేకిస్తే భవిష్యత్తులో తెలంగాణ నుంచి పోటీ చేయడమే కష్టమవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మెజార్టీ సభ్యులు చర్చకు పట్టుపట్టే రీత్యా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని ఇదే సమావేశాల్లో చర్చకు పెట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. జూలకంటి సీపీఎం సభ్యుడైనా.. ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని మీడియా ముందే స్పష్టం చేశారు. దీంతో ముసాయిదా బిల్లు చర్చకు రావడానికి పెద్దగా అడ్డంకులు ఏమీ ఉండబోవని అంటున్నారు. బీఏసీ సమావేశం శుక్రవారమే జరిగిన పక్షంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు హాజరుపై అనుమానాలున్నాయి. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం జరిగిన బీఏసీకి వారిద్దరూ గైర్హాజరైన విషయం తెలిసిందే. పైగా చంద్రబాబు శుక్రవారం రాజస్థాన్ వెళుతున్నారు. దీంతో వారిద్దరూ హాజరుకాబోరన్న అభివూపాయం వినిపిస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.