జైళ్లు..లాఠీలు.. తుపాకి గుళ్లకు బెదిరేది లేదు

KCR -ఉద్యమం ద్వారా తెలంగాణ సాధిస్తాం
-తెలంగాణవాదులపై కిరణ్ సర్కార్ నిరంకుశత్వం
-ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గాన్ని ఆపాలి
-ఎప్పటికైనా తెలంగాణ ప్రజలే గెలుస్తరు
-తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్
నాటి బ్రహ్మానందడ్డి నుంచి నేటి కిరణ్‌కుమార్‌డ్డి వరకు ఎంతో మంది సీఎంలను చూశాం.. జైళ్లు, పోలీసుల లాఠీలు, తుపాకి గుళ్లకు భయపడి ఉద్యమాన్ని విడిచే గుండెలు కావు.. కాంగ్రెస్‌లాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. ఎప్పటికైనా తెలంగాణవాదుల పోరాటమే గెలుస్తుంది. కిరణ్ నిరంకుశపాలన ఎంతోకాలం సాగదు’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈనెల 21న సడక్‌బంద్‌లో పాల్గొని అరెస్టయి మహబూబ్‌నగర్ జిల్లా జైలులో ఉన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్‌డ్డి, టీజేఏసీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, మరి కొందరిని ఆయన జైలులో కలుసుకున్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసామ్యయుతంగా సడక్‌బంద్‌లో పాల్గొన్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్గించినా, ఎన్నటికైనా తెలంగాణ ఉద్యమమే గెలుస్తుందని, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులకు కిరణ్ సర్కార్ త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌డ్డి ఓ నియంతలా వ్యవహరిస్తూ తెలంగాణవాదులపై అక్రమంగా కేసులు పెట్టి, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఎక్కడా విధ్వంసం, దాడులు జరుగకున్నా అరెస్టు చేయడమేంటని కిరణ్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. అంతకుముందు జైలులో ఉన్న వారిని కలిసి పరామర్శించారు.

గంటపాటు వారితో ఉండి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. కేసీఆర్ వస్తున్నారని తెలుసుకున్న తెలంగాణవాదులు భారీ సంఖ్యలో జైలు వద్దకు తరలివచ్చారు. జైలు ఎదుట తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నాయిని నర్సింహాడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, చెన్నమనేని రమేష్, వినయ్ భాస్కర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌డ్డి, సయ్యద్ ఇబ్రహీం, నాయకులు నారదాసు లక్ష్మణ్‌రావు ఉన్నారు.

తెలంగాణ ద్రోహులపైనే పోరాటం: హరీశ్‌రావు
తెలంగాణ ఉద్యమానికి కలిసి వచ్చే వారిపై మన పోరాటం కాదని.. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తున్న లగడపాటి, రాయపాటి లాంటి సీమాంవూధులపైనేనని హరీశ్‌రావు అన్నారు. జైలులో ఉన్న టీఆర్‌ఎస్, జేఏసీ నేతలను పరామర్శించిన అనంతరం ఆయన జిల్లా జైలు వద్ద తెలంగాణవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు జైలులో ఉన్న నేతలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కే కేశవరావు, ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య జిల్లా జైలుకు వచ్చారు. ఈ సమయంలో తెలంగాణవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు గోబ్యాక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హరీశ్‌రావు కల్పించుకొని తెలంగాణవాదులను శాంతపరిచారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమవీరులను కలిసేందుకు మన ఇంటికి వచ్చారని, తెలంగాణలో మన ఇంటికి వచ్చిన వారిని గౌరవించే సంస్కృతి ఉన్నదని చెప్పారు.

తెలంగాణ కోసం ఉద్యమించే వారందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. సడక్‌బంద్‌లో పాల్గొన్న వారిని కిరణ్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యమకారులను జైలులో పెట్టినంత మాత్రాన ఉద్యమం ఆగదనే విషయాన్ని ఇక్కడి ప్రజలు తెలియజెప్పారని అన్నారు. తెలంగాణ ఉద్యమంపై కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, చరివూతలో నియంతల పాలన ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందేనన్నారు.

అరెస్టులు అమానుషం: కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు
ఎనిమిదేళ్ల కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సంఘటనలు జరుగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. జిల్లా జైలు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1969 ఉద్యమంలో అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఉన్నాయని చెబుతూ, సడక్‌బంద్‌లో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేసిన నేతలను అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.

జైలులో ఉన్న ఉద్యమ సారథులను తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు విడుదల చేసేందుకు జడ్జి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాన్‌బెయిలబుల్ కేసులను బెయిలబుల్ కేసులుగా మార్చి బెయిల్ మంజూరు చేసినట్లు కేశవరావు చెప్పారు. డీఐజీ, సీఎం కిరణ్ కుట్రతోనే ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయని ఎంపీ మంద జగన్నాథం మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తున్న నేతలపై కేసులు పెట్టడం సమంజసంకాదని మరో ఎంపీ రాజయ్య అన్నారు. అరెస్టులను ఎంపీలు తీవ్రంగా ఖండించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.