‘జేసీ ట్రావెల్స్‌తో ప్రభుత్వం కుమ్మక్కు’

హైదరాబాద్: పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనపై ప్రభుత్వం స్పందించడంలేదని ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి బంధువుల ఆరోపిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ యజమాని జేసీ దివాకర్‌రెడ్డితో ప్రభత్వం కుమ్మక్కైందని వారు విమర్శించారు. ఇవాళ వాళ్లు రవాణాశాఖ మంత్రి బొత్త సత్యనారాయణతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బస్సు యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలిన వారు డిమాండ్ చేశారు. వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.