జేసీని పార్టీ నుంచి బహిష్కరించాలి:బొత్స

హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంతో కూడుకున్నవని, జేసీని పార్టీ నుంచి బహిష్కరించాలని హైకమాండ్‌కు లేఖ రాశానని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని, వెళ్లేవారిని ఎవరూ ఆపరని పేర్కొన్నారు. సొంత పార్టీపై ఎంపీలే అవిశ్వాసం పెట్టడం సరికాదన్నారు. విభజనకు మద్దతు ఇచ్చే బీజేపీని చంద్రబాబు ఎందుకు తప్పుపట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు 200 ఏళ్లు బతికినా సీఎం కాలేరని ఎద్దేవా చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.