జేసీకి షోకాజ్ నోటీసులు ఇస్తాం : దిగ్విజయ్

హైదరాబాద్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా సోనియాపై జేసీ చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి అడగగా దిగ్విజయ్ పై విధంగా స్పందించారు. పార్టీ నిర్ణయానికి సీఎం సహా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి దిగిపోవాలని, కాంగ్రెస్ పనై పోయిందని జేసీ గతంలో కామెంట్ చేసిన విషయం విదితమే.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.