జేపీకి తెలంగాణ సెగ

లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయవూపకాశ్ నారాయణకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దోమకొండ మండలం ముత్యంపేటలో పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బద్ధం అంజిడ్డి ప్రచారానికి గురువారం ఆయన హాజరయ్యారు. తెలంగాణ ఒక ప్రాంత సమస్య కాదని, అందరికీ సంబంధించిన సమస్య అని జేపీ అనడంతో జనం ఒక్కసారిగా ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. జేపీ మధ్యలోనే వెనుదిరిగారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.