‘జేడీ కాల్ లిస్ట్’ కేసులో సుప్రీం నోటీసులు

సీబీఐ జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణ ‘ఫోన్ కాల్ లిస్ట్’ కేసు సుప్రీంకు చేరింది. తన ఫోన్ డేటాను అక్రమంగా వినియోగించుకున్నారని జేడీ గతంలో రాష్ట్ర హైకోర్టులో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో నిందితులైన రఘురామ కృష్ణంరాజు, ఎంవీ రమణ కుమార్ తదితరులకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం కేసు విచారణకు స్వీకరించిన జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో? వివరణ ఇవ్వండంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.