జేడీయూ అధ్యక్షునిగా శరద్‌యాదవ్ ఎన్నిక

న్యూఢిల్లీ : జేడీయూ అధ్యక్షునిగా శరద్‌యాదవ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ నేతలు శరద్‌యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2006లో జార్జి ఫెర్నాండెజ్ అనంతరం జేడీయూ అధ్యక్షునిగా శరద్‌యాదవ్ మొదటిసారిగా పగ్గాలు చేపట్టారు. అనంతరం 2009లో కూడా రెండోసారి అధ్యక్షునిగా ఆయన ఎంపికయ్యారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.