జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సీఐడీ సోదాలు

ది జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇండ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో సీఐడీ ఎస్పీ కల్పనా నాయక్ ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయంలో గురువారం సోదాలు నిర్వహించారు. పూర్వాపరాలు పరిశీలించగా 1998లో జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరిగాయని తనకు చెందిన జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 76, ప్లాట్‌నెంబర్231 ప్లాటును గోపినాథ్ అనే వ్యక్తికి కేటాయించారని బాధితుడు సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో ఆ కేసును సీఐడీ వారికి బదిలీ చేశారు. ఎలాంటి సాక్షాధారాలు లేవని ఆ కేసును క్లోజ్ చేశారు. రెండేళ్ల క్రితం బాధితుడు విజిపూన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పుడు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తుచేయాలని సీఐడీకి బదలాయించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రత్యేక కార్యదర్శి హనుమంత్‌రావును సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. ఈ దాడుల్లో సీఐడీ డీఎస్పీ కృష్ణప్రసాద్‌తోపాటు 15 మంది సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నంనుంచి చీకటి పడేవరకూ సొసైటీ గేట్లు మూసేసి మరీ.. అధికారులు సోదాలు కొనసాగించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.