జూన్‌లో చలో అసెంబ్లీ

 

tjac
తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం
– ఎన్‌హెచ్ 9పై సడక్‌బంద్
– బయ్యారం వరకు బస్సుయాత్ర
– బయ్యారంపై సీఎం వైఖరిని ప్రచారం చేయాల్సిందే
– రైల్వే అధికారుల వల్లే సంసద్ యాత్రలో ఇక్కట్లు
– వారి తీరును నిలదీయాల్సిందే
– టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీ జేఏసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే సంసద్‌యావూతను దిగ్విజయంగా పూర్తి చేసి.. యూపీఏ సర్కారుకు తెలంగాణ సత్తా చాటిన టీ జేఏసీ.. విస్తృత కార్యాచరణను రచిస్తోంది. జూన్‌లో మహోధృతంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్షికమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించిన వెంటనే ‘చలో అసెంబ్లీ’ తేదీని ఖరారుచేయాలని టీ జేఏసీ నేతలు నిర్ణయించారు. విశాఖకు బయ్యారం ఇనుప ఖనిజాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని, దీనిపై నిరసనలు తెలపాలని, అందులో భాగంగా బయ్యారం వరకు బస్సు యాత్ర చేపట్టాలని చర్చించారు. గురువారం టీఎన్జీవో భవన్‌లో టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. చలో అసెంబ్లీ పూర్తయిన వెంటనే.. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై సడక్‌బంద్ చేపట్టాలని, మరోసారి ఢిల్లీకి తెలంగాణ ఉద్యమ మంటల సెగ తగిలే విధంగా సడక్‌బంద్ కార్యాచరణ ఉండాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.

వేయిమంది అమరుల స్వప్నాలను సాకారం చేసే బాధ్యతలో భాగంగా క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ టీజేఏసీ సారథ్యంలో ఉద్యమాలను నిర్మిద్దామని చర్చించారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన సంసద్ యాత్రపై సమీక్షించారు. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో సంసద్‌యాత్ర తీరుతెన్నులపై, ఉద్యమకారులకు కలిగిన అసౌకర్యాలపై, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రవర్తించిన వైఖరిపై చర్చించారు. రైల్వే అధికారులు ఉద్యమకారులతో వ్యవహరించిన పద్ధతులను, అసౌకర్యంగా, శిథిలమైన భోగీలను కేటాయించిన తీరును నేతలు తప్పుపట్టారు. ఎన్ని అడ్డంకులను ఎదురైనప్పటికీ సంసద్ యాత్రతో తెలంగాణ ఉద్యమ దుందుభి మోగించగలిగామని, యూపీఏ పాలకులను తెలంగాణ సత్తా చాటామని నాయకులు పేర్కొన్నారు. సంసద్ యాత్రలో రైల్వే అధికారుల తీరును దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి నిరసన తెలపాలని నిర్ణయించారు. అవసరమైతే రికవరీ చట్టం ప్రకారం రైల్వే అధికారులను ప్రశ్నించాలని, 15వందల మంది తెలంగాణ ఉద్యమకారులు రైలు డబ్బాలలో పడిన గోసను తెలపాలని చర్చించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డంపడుతున్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల ద్వంద్వ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, తెలంగాణ మంత్రుల నియోజకవర్గాల్లో యాత్రలు జరుపాలని, ఈ దిశలోనే ఉద్యమ కార్యాచరణ ఉండాలని భేటీలో నిర్ణయించారు.

టీ జేఏసీ కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య, టీ లెక్చరర్ల ఫోరం జేఏసీ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి సారథ్యంలోని నిర్మాణ కమిటీని పటిష్టం చేయాలని, తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీ జేఏసీ ఉద్యమ జెండాలు రెపపలాడాలని, తెలంగాణలోని ప్రతి పౌరుడికి ఉద్యమ కార్యాచరణ తెలియచేయాలని అనుకున్నారు. గ్రామాల్లో, మండలాల్లో, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలను జరపాలని నిర్ణయించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి బయ్యారం ఇనుప ఖనిజాన్ని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దుచేసే ప్రసక్తిలేదని సీఎం కిరణ్ ప్రకటించిన విధానాన్ని తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేయాలని, నిరంకుశ వైఖరిని తూర్పారపట్టాలని, ఈ దిశలో ఉద్యమాలను తీర్చిదిద్దుదామని జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి సైదోడుగా నిలిచిన రాజకీయ పార్టీలన్నింటితో చర్చించి ‘చలో అసెంబ్లీలో భాగస్వాములను చేయాలని ఆలోచన చేశారు. శుక్రవారం టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరపాలని, చలో అసెంబ్లీ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని వారు చర్చించారు. టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రావణ్‌కుమార్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేత రాజేశ్వరరావు, న్యూడెమొక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్లు విఠల్, కారం రవీందర్‌డ్డి, టీ లెక్చరర్ల ఫోరం జేఏసీ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, టీ ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సత్యం, ఉపాధ్యాయ సంఘాల నేత మణిపాల్‌డ్డి, డాక్టర్ల జేఏసీ నేత ప్రవీణ్, హైదరాబాద్ జేఏసీ నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, శ్రీధర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.