జీ 24గంటలు క్లోజ్.. ఉద్యోగులకు 3 నెలల జీతం చెల్లింపు

జీ 24గంటలును మూసివేస్తున్నట్టు ఇవాళ జీ గ్రూప్ ప్రతినిధులు చెప్పిన్రు. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు ప్రతినిధులు ఉద్యోగులు నష్టపరిహారం చెల్లించకుండానే చానల్ ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన్రు. దీంతో జర్నలిస్టులు జీ ప్రతినిధిని అడ్డుకుని.. ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన్రు. 6 నెలల జీతం పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసిన్రు.  చర్చలకు పిలిచిన జీ గ్రూప్ ప్రతినిధులు అక్టోబర్ నెలతో పాటు 3నెలల జీతాన్ని పండగలోగా ఇస్తమని హామీ ఇచ్చిన్రు. పాత ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు అంగీకరించిన్రు. న్యాయంగా రావాల్సిన జీతాన్ని కూడా పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పిడికిలి బిగిస్తేనే న్యాయం జరుగుతదని మరోసారి నిరూపితమైంది.

ధర్నా చేస్తున్న బాధిత ఉద్యోగులకు మద్దతుగా నిలిచేందుకు జీ 24గంటలు ఆఫీసుకు వెళ్లిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (తెమ్జా) ప్రతినిధులకు కృతజ్ఞతలు.

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.