జీ 24గంటలు ఆఫీస్ లో పోలీసుల సోదాలు

బొత్స చానల్ జీ 24 గంటలులో పోలీసులు సోదాలు జరిపిన్రు. హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నరు. క్రైం బ్యూరో చీఫ్ సత్యనారాయణను అదుపులోకి తీసుకునే యత్నం చేసినట్టు సమాచారం. డీజీపీ నిన్న ఓల్డ్ సిటీలో మంత్రగాడి దగ్గరికి వెళ్లారన్న వార్తను ప్రసారం చేసినందుకు పోలీసులు యాక్ష న్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. డీజీపీ బాబా దగ్గరికి వెళ్లిన వార్తలు అన్ని చానళ్లు ప్రసారం చేసినయి. కానీ డీజీపీ కొన్ని చానళ్లను టార్గెట్ చేసిన్రు. సీఎం కిరణ్ పై వ్యతిరేక వార్తలు ప్రసారం చేసినందుకే తమపై కేసులు పెట్టిన్రని యాజమాన్యం  ఆరోపిస్తున్నది. అయితే పోలీసులు బొత్సను, ఫయీంను వదిలి జర్నలిస్టులను అరెస్ట్ చేయాలనుకోవడంపై తెలంగాణ జర్నలిస్టులు మండిపడుతున్నరు.  అయినా ఒక్క తప్పుడు వార్త ప్రసారం చేశారన్న ఆరోపణతో మీడియాపై చర్యలు తీసుకున్న పోలీసులు సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర మీడియా మొత్తం..  ప్రతిరోజు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నరు.

This entry was posted in CRIME NEWS.

Comments are closed.