జీవో రద్దు చేయాల్సిందే

ఖనిజం తరలింపు జీవో అక్రమం.. అది సీమాంధ్ర సర్కారు కుట్ర
గ్రామ పరిరక్షణ దళాలుగా ఏర్పడి ఖనిజాన్ని కాపాడుకుంటాం.. బలమైన ఉద్యమం నిర్మిస్తాం
ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర ముగింపు సభలో కోదండరాం
తెలంగాణలోని నీళ్లను, ఉద్యోగాలను దోచుకున్న ఆంధ్రా పాలకులు సహజ వనరులను కాజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొడితేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు మనుగడ ఉంటుందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అందుకోసం ప్రతి ఊళ్లో గ్రామ పరిరక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఖనిజాన్ని విశాఖకు తరలించే అక్రమ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ‘ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్ర’ మంగళవారం సాయంవూతానికి ఖమ్మం జిల్లా బయ్యారం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 12వేల ఎకరాల భూములను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించటం వెనుక సీమాంధ్ర సర్కార్ కుట్ర దాగి ఉందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్స్‌ను 30 లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 60 లక్షల సామర్థ్యానికి పెంచేందుకు జారీ చేసిన జీవో వెనుక మతలబు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో కారణంగా ఒక్క బయ్యారం మండలంలోనే 12 వేల మంది ప్రజలు బతుకుదెరువు కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణలో 10లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మిస్తే 10వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావటంతో పాటు వేల మంది ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకెళ్లిన నాయకులే దుమ్ముగూడెం పేరుతో ఆంధ్రా ప్రాంతానికి, అక్కడి నుంచి రాయలసీమకు నీటిని తరలించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. 300 గ్రామాలను నీట ముంచి, మూడు లక్షల మందిని నిరాక్షిశయులను చేసి కడుతున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతం నుంచి నీళ్లు, ఇసుక, ఖనిజం తరలించాలంటే ఆ ప్రాంత గిరిజనుల అనుమతి అవసరమని రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో స్పష్టంగా ఉన్నా.. అలాంటిదేమీ లేకుండా ప్రభుత్వం ఖనిజాన్ని తరలించాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యధికంగా స్టీల్‌ను ఉత్పత్తి చేస్తున్న చైనా తరహాలో తెలంగాణ వచ్చిన తరువాత మన ఉక్కును మనమే తయారు చేసుకుంటామని స్పష్టం చేశారు. బొగ్గు తరలింపుతో బూడిదగా మిగిలిన తెలంగాణ.. ఖనిజం తరలింపుతో బొందలగడ్డగా మారుతుందని చెప్పారు. తెలంగాణను సాధించుకోవటానికి, ఉక్కును కాపాడుకోవటానికి బలమైన ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

కుట్రలను తిప్పికొట్టాలి: ఈటెల
తెలంగాణలో రూ.700లక్షల కోట్ల సంపదను దోచుకునేందుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ఓబుళాపురం, అనంతపురంలోని ఖనిజ సంపదను విశాఖ స్టీల్ యాజమాన్యం అడిగితే, తెలంగాణలోని వేల ఎకరాలను సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కేటాయించారని పేర్కొన్నారు. ఇక్కడున్న బొగ్గును, ఖనిజాన్ని తరలించుకుపోతున్న నేతలు ఆంధ్రాలో ఉన్న గ్యాస్‌ను తెలంగాణకు ఎందుకు తీసుకురావటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వెనుకబాటుతనం, పేదరికానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేచేందుకు కిరణ్ సర్కార్ పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని మంచినీటి అవసరాల కోసం వెయ్యి కోట్లు అడిగితే చిత్తూరు జిల్లాకు రూ.7350 కోట్లు కేటాయించి, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అహంకారపూరితంగా సీఎం మాట్లాడారని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కును సీమాంవూధకు తరలించుకు పోతుంటే కళ్లు మూసుకున్న ఈ ప్రాంత ప్రజావూపతినిధులకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.
bayara
బయ్యారం ఎంతో చైతన్యవంతమైన గడ్డఅని, ఇక్కడి నుంచి సీమాంధ్ర సర్కార్ ఇనుప ఖనిజాన్ని కాదుకదా తట్టెడు మట్టిని కూడా తరలించుకుపోలేదని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అడవి సంపదపై గిరిజనులకే హక్కు ఉంటుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిశ్రీవూపసాద్ చెప్పారు. తెలంగాణలోని ఖనిజ వనరులను కాపాడుకునే ఉద్యమానికి ఉద్యోగులుగా అండగా ఉంటామన్నారు. ప్రజాకాంక్షకు సాధించే క్రమంలో ఉద్యోగ సంఘాలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇదే క్రమంలో బయ్యారం ఉక్కును సైతం కాపాడుకుంటామని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. న్యూడెమోక్షికసీ రాష్ట్ర నాయకుడు కే గోవర్ధన్ మాట్లాడుతూ కిరణ్ సర్కార్ చెంచల్‌గూడ జైల్లో కేబినెట్ సమావేశాలు పెట్టుకునే దుస్థితి తలెత్తిందన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కని, అందుకోసం విశాల ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. బయ్యారం జేఏసీ కన్వీనర్ గౌని ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పరకాల ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతి, జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, రవీందర్‌డ్డి, కత్తి వెంకటస్వామి, సీతారాం నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్, ఎన్డీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సాదినేని వెంక టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, కార్యదర్శి గంగవరపు నరేందర్, లాయర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బి తిరుమలరావు, బీజేపీ జిల్లా అద్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌డ్డి తదితరులు ప్రసంగించారు. సభకు ముందు టీ జేఏసీ నాయకులు బయ్యారం గనుల ప్రాంతాన్ని పరిశీలించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.