జీవోఎం విధివిధానాలపై పార్టీల అభిప్రాయం తీసుకునుడేంది షిండే?

కాంగ్రెస్ అధిష్టానం వశపడని నాటకాలు చేస్తున్నది.  అఖిలపక్షాలు, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నమని జీవోఎం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతదని షిండే, దిగ్విజయ్ చెప్పని రోజులేదు. విధివిధానాలు నిర్ణయించాకే జీవోఎం  ఏర్పాటు చేసినమని చెప్పిన షిండే ఇప్పుడు జీవోఎంకే విధివిధానాలు చెప్పాలని అఖిలపక్ష భేటీ పెడ్తున్నట్టు ఇవాళ మళ్లొక మాట చెప్పిండు.  నవంబర్ 10 లోగా అఖిలపక్ష సమావేశం ఉంటదని చెప్పిండు.  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు బిల్లు రాకుండా చూసేందుకే కొత్త నాటకాలకు తెరతీస్తున్నరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి. వింటర్ సెషన్స్ లో తెలంగాణ బిల్లు రాకుంటే జైత్రయాత్రల పేరుతో జబ్బలు చరుచుకుంటూ తిరుగుతున్న టీకాంగ్రెస్ నేతల మెడషింపులు ఇరగ్గొట్టక తప్పదు.  టీ కాంగ్రెస్ నేతలు ఇంతవరకు తెలంగాణ కోసం చేసిందిలేదు పీకింది లేదు. మీకూ టీ టీడీపీ నేతలకు పెద్ద తేడా లేదు. చివరి దశలోనైనా అధిష్టానంపై ఒత్తిడి తెండి. తెలంగాణలోనే పుట్టినమని నిరూపించుకొండి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.