జానా సంపాదన బారెడు

janareddy
– అక్రమ సంపాదన 200 కోట్లు
– సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించండి
– హైకోర్టులో పిటిషన్ దాఖలు
రాష్ట్ర సీనియ ర్ మంత్రి కుందూరు జానాడ్డి, ఆయన అనుయాయులపై అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి విచారణ చేప కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లను ఆదేశించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అవినీతితో సంపాదించిన సుమారు రూ.200 కోట్ల మేర నల్లధనాన్ని మనీలాండరింగ్ ద్వారా తనకు చెందిన కంపెనీల్లోకి మళ్లించారంటూ కూకట్‌పల్లికి చెందిన వీ వెంక కోదాడకు చెందిన న్యాయవాది కే మధు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ పీ జయవూపకాశ్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రిగా 1983 నుంచి పలు దఫాలుగా ఉన్న జానాడ్డి.. అవినీతితో సంపాదించిన ఆక్రమ సంపాదనను ఆయన రక్త సంబంధీకుల పేరిట ప్రారంభించిన 31 కంపెనీల ద్వారా వైట్‌మనీగా మార్చారని పిటిషనర్లు ఆరోపించారు. మనీ లాండరింగ్‌పై ఆదాయం పన్ను శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేసినప్పటికీ మంత్రి జానాడ్డి, ఆయన బంధువులపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదని వివరించా రు. పైపెచ్చు ఫిర్యాదు చేసినందుకుగాను తమనే వేధించారని, బెదిరింపులు సైతం వచ్చాయని కోర్టుకు నివేదించారు. ప్రజావూపయోజనం దాగి ఉన్నందున, గత్యంతరంలేని పరిస్థితుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జానాడ్డితోపాటు ఆయన పెద్ద కుమారుడు రఘువీర్, చిన్నకుమారుడు జయవీర్, వియ్యంకుడు మేరెడ్డి కేశవడ్డి (రఘువీర్ మామ), కేశవడ్డి కుమారుడు అర్జున్‌డ్డి, జానాడ్డి అనుం గు మిత్రుడు వంగాల సంజీవడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీ ఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖ కమిషనర్లను ఆఫీషియల్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. జానాడ్డి కుటుంబీకులకు చెం దిన కంపెనీల షేర్ల విక్రయాలు, కొనుగోళ్లతోపాటు రంగాడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బాలాపూర్ గ్రామంలో పద్మశ్రీ ఎస్టేట్ పేరిట కొనుగోలు చేసిన సుమారు 111 ఎకరాల భూమి క్రయవిక్షికయాలకు సంబంధించిన పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు.

మనీ లాండరింగ్ జరిగిందిలా..: జేకేఏఆర్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ పస్తుతం ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా లిమిటెడ్): జేకేఏఆర్ (జే-జానాడ్డి, కే-కేశవడ్డి, ఏ-అశోక్‌డ్డి, ఆర్-రఘువీర్) పేరిట 2005లో జానాడ్డి కుమారులు జయవీర్, రఘువీర్‌తోపాటు, ఆయన వియ్యంకుడు మేరెడ్డి కేశవడ్డి ప్రమోటర్లుగా కంపెనీని రిజిస్ట్రర్ చేసి ప్రారంభించారు. ఈ కంపెనీలో జానాడ్డి స్వయంగా 2007 డిసెంబర్ 10, 2010 ఏప్రిల్ 24న రూ.36 లక్షలు చెల్లించి, రూ.10 ముఖవిలువ చేసే 3.6 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. అయితే ఇదే కంపెనీ 2009 మార్చి 30న ఒకొక్కటి పది రూపాయల విలువ చేసే 1,65,522 షేర్లను (ముఖ విలువ రూ 16.55 లక్ష లు) ఒక్క షేరు ధర రూ.500గా నిర్ణయిస్తూ 89 మందికి కేటాయిస్తున్నట్లు రెండు వేర్వేరు తీర్మానాలను చేసింది. ముఖ విలువ ఆధారంగా రూ.16.55 లక్షలకు బదులుగా రూ.8.28 కోట్ల కంపెనీలోకి ప్రవహించాయి. ఇందులో ముఖ విలువ తీసేయగా మిగతా సొమ్మైన రూ.8.11 కోట్లను వైట్ మనీ చేయడానికి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. రూ.500 చొప్పున ఒక్కో షేరు కొనుగోలు చేసిన వారిలో అధికశాతం జానాడ్డి రాజకీయ మద్దతుదారులు, బంధువులు, అనుయాయులే ఉన్నారు. ఇదే కంపెనీ 2010 మార్చి 4న మరో 49 మందికి రూ.500 చొప్పున 68,136 షేర్లను కేటాయిస్తూ తీర్మానం చేసింది. ముఖ విలువ ప్రకారం రూ.6.81 లక్షలు కాగా, కంపెనీ ఆర్జించింది రూ.3.41 కోట్లు. ఈ షేర్లు కొనుగోలు చేసిన వారిలో జానాడ్డి అనుచరుడైన కర్నాటి లింగాడ్డి భార్య లక్ష్మీ పేరిట 7,400 షేర్లు ఉన్నాయి. కర్నాటి లింగాడ్డి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడ్లవల్లి విజేయందర్‌డ్డి రూ.కోటి చెల్లించి 20వేల షేర్లను కొనుగోలు చేశారు. మార్చి 5న 43 మందికి రూ.500 చొప్పున 61,570, మార్చి 6న 45మందికి 2,26,453 షేర్లను కేటాయించారు.

ఈ షేర్లను కొనుగోలు చేసినవారిలో రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ సైతం ఉన్నారు. ఆయన స్వయం గా రూ.1.30 కోట్లు చెల్లించి 14 వేల షేర్లను కొనుగోలు చేశారు. ఈ సంస్థకు చెందిన మొత్తం షేర్లు రూ.5,24,681 అమ్మడం ద్వారా రూ.25.70 కోట్లు కంపెనీలోకి ప్రవహించాయి. ఈ సొమ్ము పూర్తిగా మనీలాండరింగ్ ద్వారానే వచ్చిందని, కేవలం మంత్రి అవినీతితో సంపాదించిన సొమ్మును వైట్‌మనీగా మార్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ షేర్ల కొనుగోలుదారులు 2010 మే 29న జానాడ్డి కుమారులు, బంధువులు ప్రమోటీలుగా ఉన్న ఆర్టీ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్‌కు రూ.10 చొప్పున 2,95,630 షేర్లను తిరిగి అమ్మేశారు. రూ.500 విలువతో కొనుగోలు చేసిన షేర్లను 10 నెలల కాలంలో జానాడ్డి రక్తసంబంధీకుల కంపెనీలకు రూ.10కే అమ్మడం వెనుక కుట్రదాగి ఉందని పిటిషనర్లు తెలిపారు. అలాగే జానాడ్డి రక్తసంబంధీకులకు చెందిన వైభవ్ పవర్ లిమిటెడ్, తేజస్సర్ణికా పవర్ లిమిటెడ్, హెచ్‌యూఎల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలోకి టాక్స్ హెవెన్ దేశాలైన మారిషస్ ద్వారా నిధులు మళ్లాయి) శ్రీసాయి కృష్ణ హైడ్రో ఎనర్జీసీ ప్రైవేట్ లిమిటెడ్, (సైవూపస్ దేశంలో రిజిస్టరైంది) కంపెనీల ద్వారా షేర్ల విక్రయాలు జరిగాయని, విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని తెలుపుతూ అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించారు. షేర్లను అధిక ప్రీమియంకు అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ము సుమారు రూ.44.92 కోట్లు, షేర్ల అప్లికేషన్ రూట్‌లో రూ.12.54 కోట్లు, విదేశాల సొమ్ము రూ.30 కోట్లు ఉందని తెలిపారు. జానాడ్డి బినామీ భూములపై రూ.100 కోట్లు లావాదేవీలు జరిగాయని, మొత్తం సుమారు రూ.200 కోట్ల అవినీతి సంపాదన ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.

బినామీ భూ వ్యవహారాలు..: జానాడ్డి అనుయాయుడైన వంగాల సంజీవడ్డి గతం లో విద్యాశాఖలో ఎల్‌డీసీగా పనిచేసేవారు. జానాడ్డి 2004లో హోంమంవూతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తదనంతరం రంగాడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బాలాపూర్ గ్రామపరిధిలోని సర్వే నంబరు 144 ఆర్‌లో 111.11 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ రూ.110 కోట్లు ఉండగా రిజిస్ట్రేషన్ విలువ రూ.6.08 కోట్లుగా పేర్కొన్నారు. ఎల్‌డీసీ ఉద్యోగి వందల కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేయలేరని, జానాడ్డి సంపాదననే బినామీ పేరిట మళ్లించారని పిటిషనర్లు తెలిపారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.