జాతీయ గీతం పాడరాని మీకు తెలుగు జాతి సమైక్యత ఎందుకు?

హైదరాబాద్ : ఎల్‌బీ స్టేడియం సాక్షిగా సమైక్యాంధ్ర సభలో జాతీయ గీతానికి మరోసారి అవమానం జరిగింది. సమైక్య శంఖారావం పేరుతో ఎల్‌బీ స్టేడియంలో వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభ ముగింపు సందర్భంగా జాతీయ గీతాన్ని సరిగ్గా పాడకుండా అవమానపరిచారు. అందరూ జాతీయ గీతం పాడాలంటూ జనగణ మన అధినాయక జయహే అంటూ ప్రారంభించి కాసేపు అపేశారు. అనంతరం మళ్లీ ప్రారంభించి రెండు లైన్లు కూడా పాడకుండా అన్నీ తప్పులే ఆలపించారు. గతంలో ఇదే స్టేడియంలో సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన సభలో కూడా మన జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించి అవమాన పరిచిన విషయం తెలిసిందే.

జాతీయ గీతం సక్కగ పాడరానోళ్లు మీకెందుకయా తెలుగు జాతి సమైక్యత, సమైక్యాంధ్ర?

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.