జల మండలిలో జై తెలంగాణ

 

harish-rao– టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు నేతృత్వంలో భారీ విజయం
– ఓటమిపాలయిన మంత్రి ముఖేష్‌గౌడ్ కొడుకు
– డిపాజిట్ కోల్పోయిన టీడీపీ, మజ్లిస్ సంఘాలు
– కామ్‌గార్ యూనియన్‌కు 9 ఓట్ల ఆధిక్యం
– టీఆర్‌ఎస్ సంఘానికి 1547..
– కాంగ్రెస్ యూనియన్‌కు 1449
– టీడీపీ సంఘానికి 279..
– తెలంగాణవాదం ఓటమికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
– సీమాంధ్రుల కుట్రలను ఛేదించిన టీఆర్‌ఎస్
ఆ మొన్న సింగరేణి.. మొన్న జీహెచ్‌ఎంసీ.. నిన్న ఆర్టీసీ.. నేడు జలమండలి.. ఏ ఎన్నికల్లోనైనా తెలంగాణవాదమే విజయఢంకా మోగించి అప్రతిహతంగా జయకేతనం ఎగురవేస్తోంది. తెలంగాణవాదం అన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉందని రుజువుచేస్తోంది. హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదనే శక్తులకు ఈ ఫలితాల తీరు చెంపపెట్టు. యే తెలంగాణ హమారా.. యే హైదరాబాద్ షహర్ హమారా.. అని నినదిస్తున్న జనమే తాజాగా జలమండలి ఎన్నికల్లోనూ తెలంగాణవాదానికి పట్టంగట్టారు. సీమాంధ్ర శక్తుల కుటిల కుమ్మక్కులను కార్మికలోకం తిప్పికొట్టింది. జలమండలి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏకైక తెలంగాణ యూనియన్ జయకేతనం ఎగురవేసింది. అధికార, ఆర్థిక, మందబలాన్ని మట్టికరిపించింది. అధికారం, విచ్చలవిడిగా మందు, డబ్బు పంపిణీతో తనదే విజయమని విర్రవీగిన కాంగ్రెస్‌అనుబంధ యూనియన్ నాయకుడు మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రంగౌడ్‌కు శృంగభంగమైంది. హైదరాబాద్ వాటర్‌వర్క్స్ అండ్ సివరేజ్ కామ్‌గార్ యూనియన్ (టీఆర్‌ఎస్ అనుబంధం) విజయకేతనం ఎగురవేసింది.

ప్రధానంగా వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ (కాంక్షిగెస్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు స్టాఫ్, వర్కర్స్ అసోసియేషన్ (టీడీపీ) మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కార్మికలోకం మాత్రం తెలంగాణవాదానికే జై కొట్టి కామ్‌గార్ యూనియన్‌కు పట్టం కట్టారు. హరీష్‌రావు అధ్యక్షులుగా ఉన్న కామ్‌గార్ యూనియన్ 9 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. కామ్‌గార్ యూనియన్ 1547 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్‌కు 1449 లభించాయి. దశాబ్దకాలంగా చాంపియన్‌గా ఉంటూ వస్తున్న యూనియన్‌ను కార్మికులు మట్టి కరిపించడం గమనార్హం. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ కోర్టులో కేసు ఉన్నందున ఫలితాలను అధికారికంగా ప్రకటించలేదు. మరో రెండురోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి కూడా పెద్దిడ్డి నాయకత్వంలో పోటీచేసిన టీడీపీ అనుబంధ యూనియన్‌కు జలమండలి కార్మికులు డిపాజిట్ గల్లంతు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు స్టాఫ్, వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో పెద్దిడ్డి ముచ్చటగా ఐదోసారి బరిలో దిగారు.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ బృందం సహకారంతో ప్రచారం జరిపి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కానీ సమైక్యపార్టీ ముసుగులో వచ్చిన పెద్దిడ్డిని కార్మికులు ఛీకొట్టారు. పోలైన 374 ఓట్లలో ఆ సంఘం కేవలం 279 ఓట్లు మాత్రమే సాధించింది. సీమాంధ్ర పార్టీలతో జతకడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను విస్మరించిన మజ్లిస్ పార్టీకి సైతం జలమండలి కార్మికులు డిపాజిట్ గల్లంతు చేశారు. హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై సివరేజ్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ తరపున పోటీచేసిన ఎంఐఎం ఎమ్మెల్యే బలాలకు కేవలం 473 ఓట్లు మాత్రమే వచ్చాయి. జ్ఞానేశ్వర్ యూనియన్ మద్దతును కూడగట్టుకున్నప్పటికి మజ్లిస్ సైతం తెలంగాణకు వ్యతిరేకంగా వెళ్ళి బోర్లాపడింది. హైదరాబాద్ నగరంలో తెలంగాణవాదమే లేదని విర్రవీగుతున్న సమైక్యవాదులకు ఈ ఎన్నికలు మరోమారు చెంపపెట్టుగా నిలిచాయని తెలంగాణవాదులు పేర్కొన్నారు. జలమండలి కార్మికులకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.

హైదరాబాద్‌లో తెలంగాణవాదాన్ని తక్కువ చేసినవారికి ఈ ఎన్నికలు చెంపపెట్టని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆంధ్రపార్టీలకు బుద్ధి చెప్పింవూడని తెలంగాణవాదమే గెలిచిందని టీఎంయూ నేత అశ్వత్థామడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక అంతటా టీఆర్‌ఎస్ జెండాలను ఎగురేస్తామని టీఆర్‌ఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణవాదమే గెలుస్తుందని ఉద్యోగసంఘాల జేఏసీ నేత దేవీవూపసాద్ పేర్కొనగా, తెలంగాణవాదానికి తిరుగులేదని టీఆర్‌ఎస్ నేతలు శ్రావణ్, వీ ప్రకాశ్ తదితరులు స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.