జలమండలిలో ‘తెలంగాణ’దే జయం

  tg– ఆర్టీసీ ఫలితాలే పునరావృతం
– గుర్తింపు యూనియన్
ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు
గ్రేటర్ హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదన్న వాళ్ల చెంప చెళ్లుమనింపిచేలా జలమండలి గుర్తింపు యూనియన్ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, హైదరాబాద్ వాటర్‌వర్క్స్‌అండ్ సివరేజీ కామ్‌గార్ యూనియన్ ప్రెసిడెంట్ హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎన్నికల తీర్పుతో ఢిల్లీకి షాక్ తగిలిందని, ఈ జలమండలి కార్మికులు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిమ్మ తిరగడం ఖాయమని అన్నారు. హైదరాబాద్‌పై చిత్తమొచ్చినట్లు మాట్లాడుతున్న నాయకులకు గట్టిగా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని జలమండలి కార్మికులకు సూచించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని వాటర్‌వర్క్స్ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచార కార్యక్షికమంలో హరీశ్‌రావు, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి ప్రసంగించారు. ‘‘సీఎం కిరణ్‌కుమార్‌డ్డి మాట్లాడితే.. హైదరాబాద్ నాదీ అంటడు. మరి మొన్నటి బడ్జెట్‌లో చిత్తూరుకు రూ.7.5వేల కోట్లు కేటాయిస్తే..

నగర వాటర్‌వర్క్స్‌శాఖకు మాత్రం ఆస్తులు తనఖా పెట్టుకుని రుణాలు తెచ్చుకోవాలని చెప్పాడు. ఆయనకు నగరంపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో ఈ ఒక్క సంగతితోనే అర్థమైతున్నది. మనిషి ఇక్కడ ఉన్నా.. మనసు మాత్రం చిత్తూరుపైనే ఉంది’’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. జలమండలిపై తెలంగాణ జెండా ఎగురవేసి మన హక్కులను మనం రక్షించుకుద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలోని పది జిల్లాల నుంచి ఏ స్థానం నుంచైనా సరే.. ఛాన్స్ నీకే ఇస్తున్నం. ఎక్కడినుంచి పోటీ చేస్తావో.. అక్కడినుంచే మా పార్టీ అధినేత కేసిఆర్ పోటీ చేస్తాడు. దీనికి సిద్ధమా?’’ అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి.. చంద్రబాబు చివరకు చిత్తూరుకే పరిమితమవుతాడని జోస్యం చెప్పారు. ఇక కేసిఆర్‌పై వ్యాఖ్యలు చేసిన తలసాని ఓ బచ్చా అని కొట్టిపారేశారు. ‘‘ముఖేష్‌గౌడ్, పెద్దిడ్డి యూనియన్ల ప్రలోభాలను లోనుకావద్దు. ఓటు బాణం గుర్తుకు వేయండి’’ అని నాయిని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.